Mutton Chicken Shops : రేపు మటన్, చికెన్ షాపులన్నీ బంద్.. ఎందుకంటే ..?
Mutton Chicken Shops : మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్.
- By Pasha Published Date - 02:09 PM, Sat - 20 April 24
![Mutton Chicken Shops : రేపు మటన్, చికెన్ షాపులన్నీ బంద్.. ఎందుకంటే ..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/Mutton-Chicken-Shops.jpg)
Mutton Chicken Shops : మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్. ప్రతీ సండే రోజు మార్కెట్‌కు వెళ్లి మటన్, చికెన్ తెచ్చుకునే వారికి.. ఈ సండే రోజు మటన్, చికెన్ దొరకదు. ఎందుకంటే ఈ ఆదివారం రోజున మటన్, చికెన్ షాపులు తెరుచుకోవు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం రోజు మాంసం విక్రయాలను బంద్ చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఏప్రిల్ 21న (ఆదివారం రోజు) జైనుల మత గురువు మహావీర్ జయంతి ఉంది. జైనుల పండుగలలో ఇది ముఖ్యమైనది. జైనులు పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉంటారు. జైనులకు సంఘీభావంగా నిలిచేందుకు, వారి మత విశ్వాసాలకు గౌరవించేందుకే ఈ ఆదివారం రోజు హైదరాబాద్‌లో మటన్, చికెన్ షాపులను బంద్ చేయించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
We’re now on WhatsApp. Click to Join
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మటన్ , చికెన్ షాపులతో పాటు కబేళాలు, మాంసం మార్కెట్లు అన్నీ బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనల్ రొనాల్డ్ రాస్ ఆర్డర్స్ జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎవరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల కారణంగా రేపు (సండే రోజు) సిటీలోని మటన్ షాపులన్నీ(Mutton Chicken Shops) జనం లేక వెలవెలబోతాయి.
Also Read :Avinash Reddy Assets : వైఎస్ అవినాశ్ రెడ్డి ఆస్తులు, అప్పుల వివరాలివీ..
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/KTR-2-1.jpg)
KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు
ప్రశ్నలు, జవాబులు, పంచ్‌లు.. ప్రాసలతో సభ అంతా రసవత్తరంగా సాగింది. అయితే ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR Comments) ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.