HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Azharuddin Got Ministerial Post Because Of Kcr Harish Rao

కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు

మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం వెనుక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభావం ఉందనేది హరీష్ రావు ప్రధాన వాదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజహరుద్దీన్ వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బిఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిందని,

  • Author : Sudheer Date : 08-02-2026 - 7:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Azharuddin
Azharuddin

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజహరుద్దీన్‌కు పదవి రావడం వెనుక కేసీఆర్ భయం ఉందంటూ ఆయన చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా మారింది.

మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం వెనుక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభావం ఉందనేది హరీష్ రావు ప్రధాన వాదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజహరుద్దీన్ వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బిఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిందని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ కృతజ్ఞతగా కేసీఆర్ ఫొటోకు దండం పెట్టాలని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ప్రశ్నించబట్టే ఒక మైనారిటీ నేతకు ఈ అవకాశం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడుస్తున్నా, ఆయనకు ఇప్పటివరకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించకపోవడంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఏదో ఒక సభలో (అసెంబ్లీ లేదా కౌన్సిల్) సభ్యుడిగా ఎన్నిక కావాలి. మరో మూడు నెలల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని హరీష్ రావు జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అజహరుద్దీన్‌ను కేవలం తాత్కాలిక అవసరాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

Sit Inquiry Kcr

Sit Inquiry Kcr

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. తనకు వంద నోటీసులు ఇచ్చినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపనని, ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల పక్షాన బిఆర్ఎస్ గొంతుక వినిపిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మైనారిటీ నేతలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎండగడతామని ఆయన హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • azharuddin
  • brs
  • cm revanth
  • congress
  • harish rao
  • kcr
  • Minister Post
  • అజహరుద్దీన్
  • కేసీఆర్
  • హరీష్ రావు

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • Amazon AI Store : అందుబాటులోకి అమెజాన్ ‘AI స్టోర్’

    • Mahindra University : మహీంద్రా యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రారంభం

    • HMD : హెచ్ఎండీ బ్రాండ్ అంబాసిడర్‌గా రాఘవ్ జుయల్

    • Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • Delimitation : డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం అంటూనే మెలిక పెట్టిన వైసీపీ ఎంపీ

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd