HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Awards For Telangana Best Awards In 8 Categories All Over India

Awards to Telangana: తెలంగాణకు అవార్డుల పంట.. 8 కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు!

తెలంగాణకు మరోసారి కేంద్ర అవార్డుల (Awards) పంట పండింది.

  • By Balu J Published Date - 04:36 PM, Fri - 7 April 23
  • daily-hunt
Award
Award

తెలంగాణ (Telangana) రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని అవార్డులు వచ్చి చేరాయి. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి కేంద్ర అవార్డుల (Awards) పంట పండింది. అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నిలిచింది. దేశంలో నెంబర్ వన్ తో పాటుగా, వరసగా 4 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే దేశంలో మొత్తం 9 వివిధ కేటగిరిల్లో ప్రకటించిన ఈ అవార్డుల్లో 8 కేటగిరీల్లో 8 అవార్డులు వచ్చాయి. ఏప్రిల్ 24న ఢిల్లీలో జరిగే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను రాష్ట్రానికి అందచేస్తారు.

ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలను స్థానిక స్వపరిపాలనలో వారి పనితీరును మెరుగుపరచడానికి ప్రోత్సాహకంగా అవార్డుల రూపంలో ప్రోత్సహిస్తుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో భాగంగా, ఆన్‌లైన్ లో పంచాయతీల ద్వారా నామినేషన్‌లను తీసుకొని 9 అంశాలలో(థీమ్‌లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులను ఇవ్వటం జరుగుతుంది. అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలలో పోటీతత్వం పెరిగి మరింత అభివృద్ధికి కృషి చేస్తాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాగా కృషి చేస్తున్న గ్రామ పంచాయతీలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రకటించినది. ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డుల మాదిరి కాకుండా ఈ సంవత్సరము నుండి అవార్డులను 9 అంశాలలో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇచ్చింది.

ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులతో సూచికలను ప్రకటించింది ఈ తొమ్మిది అంశాలలో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో అత్యుత్తమ పంచాయతీలుగా ప్రకటించారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులు కల్పించిన గ్రామం. 2. ఆరోగ్యవంతమైన గ్రామం, 3. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, 4. నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం, 5. పచ్చదనం మరియు పరిశుభ్రత గ్రామం, 6. స్వయం సమృద్ధితో, మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామం, 7. సామాజిక భద్రత కలిగిన గ్రామం, 8. సుపరి పాలన ఉన్న గ్రామం, 9. మహిళా స్నేహపూర్వక గ్రామం.

ఇదిలా ఉండగా, సీఎం కెసిఆర్, కేటీఆర్ లు, కెసిఆర్ గారి మార్గనిర్దేశనం, వారి మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే..వారి సహకారం వల్లే ఈ అవార్డులు దక్కాయి. వారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు, డిఆర్డీవోలు, డిపిఓలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు, తన, పంచాయతీరాజ్ సిబ్బంది, సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, సహకరించిన ప్రజలకు పేరుపేరునా మంత్రి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రాని గ్రామాలు అవార్డులు తెచ్చుకోవడానికి పట్టుదలతో పని చేయాలని సూచించారు.

ఇదిలావుండగా, గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ- పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల మూత్ర రహిత రాష్ట్రంగా, ఉత్తమ ఆడిటింగ్ వంట అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, అనేకానేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు. అలాగే ఆయా అంశాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అని మంత్రి వివరించారు.

తెలంగాణ (Telangana) మరోసారి మెరిసింది: కేటీఆర్

తెలంగాణ మరోసారి మెరిసింది. జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో అద్భుత ప్రతిభను చాటింది. తలసరి ఆదాయంలో అత్యధిక పెరుగుదల వచ్చింది. ఉత్తమంగా తెలంగాణ గ్రామ పంచాయతీలు నిలిచాయి. ఓడిఎఫ్ లోనూ దేశంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నాం. గొప్ప ముందు చూపుతో ప్రారంభించి అమలు చేస్తున్న సిఎం కెసిఆర్ గారి మానసపుత్రిక పల్లె ప్రగతి కార్యక్రమం అటు రాష్ట్రానికి, ఇటు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఆయన టీమ్ కి శుభాకాంఓలు, అభినందనలు అంటూ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేశారు.

తెలంగాణ (Telangana)కు వచ్చిన అవార్డులు

దేశంలోనే మరోసారి తెలంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి.
1-ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్
2-సరిపోను మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల
3-సామాజిక భద్రత గల గ్రామాల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి
4-స్నేహపూర్వక మహిళా గ్రామాల విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం అయి పూర్
5-పేదరిక నిర్మూలన, జీవనోపాదులు పెంచిన గ్రామాల విభాగంలో గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం
6-సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం చీమల్ దారి
7-క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్ పూర్
8-స్వయం సమ్రుద్ధ మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ రావు పేట మండలం గంభీర్ రావు పేట గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి.

Telangana shines yet again ✊

Best performer in National Panchayat Awards

✅ Highest Rise in Per Capita
✅ Best Gram Panchayats
✅ 100% ODF + Villages as per Govt of India

All credit to Visionary CM KCR Garu and his brainchild “Palle Pragathi” which has uplifted the villages… pic.twitter.com/Esc38P7zwA

— KTR (@KTRBRS) April 7, 2023

Also Read: Shah Rukh Khan: గ్లోబల్ స్టార్ బాలీవుడ్ కింగ్ ఖాన్.. TIME100 జాబితాలో షారుక్ టాప్ ప్లేస్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • awards
  • central governament
  • cm kcr
  • telangana

Related News

Bandh Effect

BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Cctv Camera In Bathroom

    CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd