HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Attacked On Brother And Sister By A Man Brother Died

Attack : అక్కాతమ్ముళ్లపై దాడి చేసిన యువకుడు.. తమ్ముడు మృతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?

మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న సంఘవి ఇంటికి రామంతపూర్ కు చెందిన శివకుమార్ వెళ్లాడు.

  • Author : News Desk Date : 03-09-2023 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Attacked on Brother and Sister by a man Brother died
Attacked on Brother and Sister by a man Brother died

ఓ యువకుడి దాడిలో తమ్ముడు పృథ్వీ మృతి చెందగా.. అక్క సంఘవి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ దారుణ ఘటన ఆదివారం మధ్యాహ్నం ఎల్బీనగర్(LB Nagar) ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో సంఘవి, చింటూ(పృథ్వీ) మాత్రమే ఉన్న సమయంలో లోపలికి చొరబడిన యువకుడు ఇద్దరిపై దాడికి(Attack) పాల్పడ్డాడు.

మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న సంఘవి ఇంటికి రామంతపూర్ కు చెందిన శివకుమార్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు చింటూ ఉండగా కొద్దిసేపటికి చింటూ – శివకుమార్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శివకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు.

మొదటి అంతస్తులో ఈ ఘటన జరగగా అద్దాలు పగిలిన శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని శివకుమార్ ను బంధించారు. తీవ్రగాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న సంఘవి, చింటూలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చింటూ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం సంఘవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘవి, శివకుమార్ లకు గతంలోనే పరిచయం ఉండి ఉండవచ్చని, ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శివ కుమార్ ని విచారించిన అనంతరం మిగతా విషయాలు తెలియచేస్తామని తెలిపారు.

 

Also Read : Fraud : విద్యాసంస్థలో భారీ లాభాలని ఆశ చూపి.. ఎన్నారైని నిండాముంచిన ఘరానా దంపతులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • crime
  • LB Nagar
  • LOVE AFFAIR
  • murder

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

  • Suryakumar Yadav : అక్షర్ పటేల్ కు క్షేమపణలు చెప్పిన కెప్టెన్ సూర్య..ఎందుకని ?

  • Lover Suicide : పెళ్లికి ఆలస్యం చేస్తుందని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd