Telangana Elections 2023 Atmasakshi Survey : తెలంగాణలో మళ్లీ అధికారం బిఆర్ఎస్ దే
ఆత్మసాక్షి సంస్థ బీఆర్ఎస్ పార్టీ 64-70 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 37-43 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ 5-6 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది
- By Sudheer Published Date - 04:00 PM, Mon - 30 October 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజుల సమయమే మాత్రమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికారం లో మీము వస్తే అవి చేస్తాం..మీము వస్తే ఇవి చేస్తాం అంటూ ఎవరికీ వారు హామీలు ఇచ్చుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో పలు సర్వేలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో..? ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయో..? సర్వేలు చేస్తూ వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు తమ రిపోర్ట్ లను తెలియజేయగా..తాజాగా ఆత్మసాక్షి (Atmasakshi Survey ), రాజనీతి (Rajneethi Survey) సంస్థలు తెలంగాణ లో రాబోయేది బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వమే అని తేల్చి చెప్పాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆత్మసాక్షి (Atmasakshi ) సంస్థ బీఆర్ఎస్ పార్టీ 64-70 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ (TS Congress) 37-43 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ 5-6 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. మరో 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తమ సర్వేలో తేలిందని ఆత్మ సాక్షి సంస్థ చెప్పుకొచ్చింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలతో పాటు కర్ణాటక ఎలక్షన్లలోనూ ఆత్మసాక్షి తెలిపిన ఫలితాలు నిజం కావడం తో ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందని బిఆర్ఎస్ శ్రేణులు నమ్ముతున్నారు. మరో సంస్థ రాజనీతి కూడా తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ 77 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని , కాంగ్రెస్ పార్టీ కేవలం 29 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని, బీజేపీ కేవలం ఏడు స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. మరి ఈ సర్వేలు తెలిపినట్లు నిజం అవుతాయా..? లేదా అనేది చూడాలి.
Read Also : Telangana: పోటీ నుంచి తప్పుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ తో దోస్తీ