Passport Application : పాస్‌పోర్టుకు అప్లై చేస్తున్నారా ? జనన, నివాస ధ్రువీకరణ కోసం ఈ పత్రాలివ్వండి
పాస్‌పోర్టుకు(Passport Application) అప్లై చేసేవారు జనన ధ్రువీకరణ కోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జారీ చేసిన ధ్రువపత్రాలను సబ్మిట్ చేయొచ్చు.
- By Pasha Published Date - 09:28 AM, Thu - 19 December 24

Passport Application : పాస్‌పోర్టు కోసం ఇటీవల కాలంలో అప్లై చేసిన చాలామంది జనన ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌కార్డును సమర్పించారు. అయితే అది చెల్లుబాటు కాలేదు. దీంతో వాళ్లు ఇతరత్రా పత్రాలను జనన ధ్రువీకరణ కోసం సమర్పించి, ఆమోదాన్ని పొందే సరికి ఇంకో పది రోజుల టైం పట్టింది.
జనన ధ్రువీకరణ కోసం..
- పాస్‌పోర్టుకు(Passport Application) అప్లై చేసేవారు జనన ధ్రువీకరణ కోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జారీ చేసిన ధ్రువపత్రాలను సబ్మిట్ చేయొచ్చు.
- పదోతరగతి మెమో ఇవ్వొచ్చు.
- ప్రభుత్వ జీవిత బీమా సంస్థల నుంచి జారీ అయిన పాలసీ బాండ్‌ను సమర్పించవచ్చు.
- ప్రభుత్వ ఉద్యోగులు అయితే సర్వీస్ రికార్డు కాపీ ఇవ్వొచ్చు.
- విశ్రాంత ఉద్యోగులు అయితే పే పెన్షన్ ఆర్డర్ కాపీని సదరు శాఖకు చెందిన పరిపాలన విభాగం నుంచి అటెస్టేషన్ చేయించి సమర్పించాలి.
- ఎన్నికల ఫొటో ఐడెంటిటీ కార్డును సమర్పించవచ్చు.
- ఆదాయపు పన్నుశాఖ జారీ చేసిన పాన్‌కార్డు (పుట్టిన తేదీ అందులో ఉండాలి)ను ఇవ్వొచ్చు.
- రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ను సబ్మిట్ చేయొచ్చు.
- అనాథాశ్రమంలో పెరిగినవారైతే అనాథ శరణాలయం అధిపతి డిక్లరేషన్‌ను ఇవ్వొచ్చు.
- చైల్డ్‌కేర్ హోమ్‌లో పెరిగితే అక్కడి అధిపతి లెటర్‌హెడ్‌పై పుట్టిన తేదీని ధ్రువీకరిస్తే సరిపోతుంది.
Also Read :Self Made Entrepreneurs : స్వయం కృషితో ఎదిగిన 200 మంది శ్రీమంతుల్లో 13 మంది తెలుగువారు
నివాస ధ్రువీకరణ కోసం..
- పాస్‌పోర్టుకు అప్లై చేసేవారు నివాస ధ్రువీకరణ కోసం నల్లా బిల్లు ఇవ్వొచ్చు.
- టెలిఫోన్ లేదా పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లు కూడా ఇందుకు తీసుకుంటారు.
- విద్యుత్తు బిల్లును కూడా సబ్మిట్ చేయొచ్చు.
- ఇన్‌కంట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డర్ కాపీని ఇవ్వొచ్చు.
- ఎన్నికల కమిషన్ ఫొటో ఐడీని కూడా సమర్పించవచ్చు.
- ప్రూఫ్ ఆఫ్ గ్యాస్ కనెక్షన్‌ను ఇవ్వొచ్చు.
- ప్రముఖ కంపెనీల చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వొచ్చు.
- జీవిత భాగస్వామి పాస్‌పోర్టు ఉంటే ఆ కాపీని ఇవ్వొచ్చు.
- మైనర్లు అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్టు కాపీని సమర్పించవచ్చు.
- ఆధార్‌కార్డును కూడా నివాస ధ్రువీకరణ కోసం ఇవ్వొచ్చు.
- రెంట్ అగ్రిమెంట్ పత్రాలతో పాటు బ్యాంకు పాస్‌బుక్‌లను కూడా అడ్రస్ ప్రూఫ్ కోసం ఇవ్వొచ్చు.