HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Anxiety Of Tet Candidates Telangana Government Planning To Reduce Exam Fees

TET Fee : ‘టెట్’ ఫీజులు తగ్గించే యోచనలో ప్రభుత్వం ?

TET Fee :  తెలంగాణలో టెట్ అభ్యర్థులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. 

  • Author : Pasha Date : 25-03-2024 - 6:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TS TET 2023
Tet Notification

TET Fee :  తెలంగాణలో టెట్ అభ్యర్థులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.  గతంలో టెట్ ఒక పేపర్‌కు పరీక్ష ఫీజు  రూ.200 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.1000కి పెంచారు. టెట్ ఎగ్జామ్‌ను రెండు పేపర్లకు రాస్తే గతంలో ఫీజు రూ.300 ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.2,000కు పెంచేశారు. టెట్ పరీక్ష ఫీజుల పెంపుపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.  టెట్ ఫీజుల పెంపు వ్యవహారం తాజాగా  సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంవో వర్గాలు సీఎంకు వివరించాయి. దీంతో సమస్య తీవ్రతరం కాకముందే ఫీజును తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని అంటున్నారు. కోచింగ్, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజులు అదనపు భారంగా మారాయని టెట్ అభ్యర్థులు(TET Fee) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • రాష్ట్రంలో మార్చి 15న  టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.
  • మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
  • ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
  • అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు.
  • 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read : WhatsApp lock: వాట్సాప్ లాక్ ఇకపై మరింత ఈజీ.. థర్డ్ పార్టీ యాప్స్ కి బై చెప్పండి?

  • టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
  • టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
  • డీఎస్సీ రాతపరీక్షలను జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ లో నిర్వహించనున్నారు.
  • టెట్ నిర్వహణ తప్పనిసరి కావడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును విద్యాశాఖ జూన్‌ 20 వరకు పొడిగించింది.

Also Read :Geethanjali Malli Vacchindi : రాజకీయాలను సినిమాలకు ముడి పెట్టొద్దు.. ఎంతమంది అడ్డు పడినా సినిమా రిలీజ్ చేస్తాం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jobs
  • telangana government
  • TET Candidates
  • TET Fee Hike

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • High Court takes a serious view of the Owaisi educational institution!

    Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

  • Telangana government changes the name of the Labour Department.. from now on it will be the ‘Energy’ Department

    కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై ‘శక్తి’ శాఖగా

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

  • The Fisheries Department has issued orders banning fishing in the Godavari River, as well as in irrigation projects and tanks.

    Telangana Government: గోదావరి నదితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఆదేశాలు జారీ

Latest News

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd