T Congress : తెలంగాణలో కాంగ్రెస్‌కి మరో షాక్.. రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ పార్టీకి
- Author : Prasad
Date : 28-08-2022 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంఏ ఖాన్ కాంగ్రెస్ అ్రగనాయకత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. తనకు విద్యార్థి దశ నుంచే పార్టీతో నాలుగు దశాబ్దాల పాటు అనుబంధం ఉందని అన్నారు.
పార్టీ సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం జి 23 సీనియర్ నాయకులు లేవనెత్తిన స్వరాన్ని నాయకత్వం అసమ్మతిగా భావించిందన్నారు. ఆ నాయకులను విశ్వసించి, పార్టీ పునరుద్ధరణ కోసం వారి బాధలు, వేదన అర్థమై ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని లేఖలో పేర్కొన్నారు. పార్టీ అట్టడుగు స్థాయి కార్యకర్తలను తిరిగి క్రియాశీలం చేసేందుకు అగ్ర నాయకత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయనందున, పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ నాయకత్వంలో పార్టీ ప్రదర్శించిన నిబద్ధత, అంకితభావంతో దేశానికి సేవ చేస్తూనే ఉన్నందున సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చిందన్నారు.