HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Another Sensation In Telangana Governor Indrasena Reddys Phone Tap

Phone Tapping Case : మరో సంచలనం.. గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌‌ సైతం ట్యాప్

2023 అక్టోబరు 26న ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా(Phone Tapping Case) నియామకం అయ్యారు.

  • Author : Pasha Date : 25-01-2025 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Governor Indrasena Reddy Telangana Phone Tapping Case Bjp

Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో ముడిపడిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. త్రిపుర గవర్నర్‌, బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఫోన్‌‌ను కూడా అప్పట్లో ట్యాప్‌  చేయించారని పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్‌ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. 2023 సంవత్సరం నవంబరు 15 నుంచి నవంబరు 30 మధ్య ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు తేలింది. 2023 అక్టోబరు 26న ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా(Phone Tapping Case) నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించడం గమనార్హం.

Also Read :Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌‌‌కు చిట్టడవి ఊపిరి

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకుగానూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను డీఎస్సీ ప్రణీత్‌ రావు బృందం ధ్వంసం చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వారిని అక్కడి నుంచి భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ సీఐడీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే భారత విదేశాంగ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి వినతి పంపింది. ప్రభాకర్, శ్రవణ్‌లకు భారత్‌కు అప్పగించాలని కోరింది. అమెరికా, భారత్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా అప్పగింత జరిగే అవకాశం ఉంది. అయితే ఇందుకు కొంత సమయం పట్టొచ్చు.

Also Read :Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏ4 నిందితుడు ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్న గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేసినందున.. కేసీఆర్ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఈ కేసుతో ముడిపడిన విచారణకు కేంద్ర సర్కారు వైపు నుంచి సహకారం లభించే ఛాన్స్ ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Governor Indrasena Reddy
  • phone tap
  • Phone Tapping Case
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd