Annapurna Studios Donation : తెలంగాణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం
Annapurna Studios donation for Telangana : ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నటి, నిర్మాత యార్లగడ్డ సుప్రియ రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు.
- By Sudheer Published Date - 09:34 PM, Tue - 10 September 24

Annapurna Studios donation for Telangana : ఇటీవల తెలంగాణ (Telangana) లో కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) అపార నష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం , ములుగు, మహబూబాబాద్ జిల్లాలో ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ప్రభుత్వం దాతలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు సినీ , రాజకీయ , బిజినెస్ ఇలా అన్ని రంగాల వారు తమ వంతు సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేయగా..తాజాగా ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) తరఫున నటి, నిర్మాత యార్లగడ్డ సుప్రియ (Yarlagadda Supriya) రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం ఆమెను అభినందించారు.
అలాగే లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ (Kiran Kumar is the owner of Lalita Jewellers) తన వంతు సాయం అందించారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ”నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం రేలిఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ఇచ్చాను. ఈరోజు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ఇచ్చాను. రెండు తెలుగు రాష్ట్రాలో వరదల వల్ల పెద్ద నష్టం జరిగింది. నేను ఇచ్చింది పెద్ద అమౌంట్ కాదు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. అందుకే నా వంతు సాయం చేశాను. ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలి. వ్యాపారులు సైతం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాన”ని ఈ సంధర్బాహ్న్గా కిరణ్ కోరారు.
Read Also : Sidda Raghava Rao Joins TDP Soon : అతి త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి..