Sidda Raghava Rao Joins TDP Soon : అతి త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి..
Sidda Raghava Rao Joins TDP Soon : తన సోదరులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసిన ఆయన వరద సాయంగా రూ.50 లక్షలు అందజేశారు.
- By Sudheer Published Date - 08:44 PM, Tue - 10 September 24

Sidda Raghava Rao Joins TDP Soon : జగన్ (Jagan) కు సొంత పార్టీ నేతలు వరుస షాకులు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి ఆగినట్లే అని తెలిసి..చాలామంది నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లో చేరి ఎమ్మెల్యే టికెట్స్ దక్కించుకొని , ఈరోజు పదవిలో కూర్చున్నారు. ఫలితాల అనంతరం మిగతా నేతలు కూడా వైసీపీ ని వీడుతూ వస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా అనేక మంది పార్టీకి రాజీనామా చేసి టీడీపీ , జనసేన లో చేరుతున్నారు.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు (Sidda Raghava Rao ) సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా తన సోదరులతో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను కలిసిన ఆయన వరద సాయంగా రూ.50 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా శిద్దా పార్టీలో చేరికపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శిద్దా రాఘవరావుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దేవాలయం నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.దాన ధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు. 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు శిద్దా రాఘవరావు చంద్రబాబు మంత్రివర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున బరిలోకి దిగాలని ట్రై చేసినప్పటికీ , టికెట్ దక్కకపోవడం సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం తో మళ్లీ సొంత పార్టీలోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు.
Read Also : Maanas : తండ్రి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. బాబు పుట్టాడు అంటూ..