Anchor Swetcha Votarkar : తన రెండు కళ్లను దానం చేసిన యాంకర్ స్వేచ్ఛ
Anchor Swetcha Votarkar : ఆమె మరణానంతరం నిర్వహించిన పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆమె రెండు కళ్లను దానం (Donate both eyes) చేసినట్లు వెల్లడించారు
- By Sudheer Published Date - 01:42 PM, Sun - 29 June 25

ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటర్కర్ (Swetcha Votarkar) తన చావుతో కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపే కృషి చేశారు. ఆమె మరణానంతరం నిర్వహించిన పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆమె రెండు కళ్లను దానం (Donate both eyes) చేసినట్లు వెల్లడించారు. ఈ కళ్లను సేకరించి దృష్టి కోల్పోయినవారికి ప్రతిరూపంగా వెలుగునిచ్చే ప్రయత్నం చేయనున్నారు. చనిపోయిన తర్వాత కూడా ఆమె చేసిన ఈ సేవా దృక్పథం అందరిలో ప్రశంసలతో పాటు ఆవేదన కలిగిస్తోంది.
Best Mileage Cars: భారతదేశంలో అధిక మైలేజ్‌తో పాటు తక్కువ ధరకు లభించే కార్లు ఇవే!
స్వేచ్ఛ తన ఇంట్లో ఉరేసుకుని చనిపోవడం తీవ్ర సంచలనం రేపిన నేపథ్యంలో, ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఆమె సన్నిహితుడు అయిన జర్నలిస్ట్ పూర్ణచందర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రులు అతనిపై పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్ణచందర్ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
YS Jagan : సింగయ్య పడింది జగన్ కారు కిందే.. ఫోరెన్సిక్ నివేదిక
తనపై వచ్చిన ఆరోపణలపై పూర్ణచందర్ తన వాదనను ఒక ఐదు పేజీల లేఖ రూపంలో వెల్లడించారు. ఆ లేఖలో స్వేచ్ఛతో 2009 నుంచి పరిచయం ఉందని, 2020 నుంచి ఆమె తనను భర్తగా భావించిందని పేర్కొన్నారు. అంతేగాక ఆమె కూతురు అరణ్య బాధ్యతను కూడా తానే భుజాన వేసుకున్నానని చెప్పారు. తనపై తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పూర్ణచందర్ స్పష్టం చేశారు. ఈ కేసులో నిజమైన సత్యం ఏంటన్నది పోలీసుల దర్యాప్తులో త్వరలో బయటపడనుంది.