AP : 35 శాతం ఓట్లతో తెలంగాణలో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తాం – అమిత్ షా
- By Sudheer Published Date - 09:25 PM, Thu - 28 December 23

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) ఈరోజు హైదరాబాద్ (Hyderabad) కు వచ్చారు. బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా..పార్లమెంట్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేసారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections 2023) ఫలితాలపై సమీక్షించారు. కొత్త ప్రభుత్వం పాలన, రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, గరికపాటి, చాడా సురేష్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో 35శాతం ఓట్లతో 10 పార్లమెంటు (Lok Sabha Elections) సీట్లు గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8కి వచ్చాయని, ఇది వచ్చే ఎన్నికల్లో 64 కావచ్చు .. 95 కూడా కావచ్చు అని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీ దేనని ఆయన ఉద్ఘాటించారు. బీఅర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్దంగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు. బీజేపీ ముఖ్యనేతల మధ్య కోల్డ్‌వార్‌పై అమిత్ షా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్‌రెడ్డిని ఆదేశించారు.
Read Also : AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 సీట్లు పక్క – సినీ నిర్మాత జోస్యం