AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 సీట్లు పక్క – సినీ నిర్మాత జోస్యం
- Author : Sudheer
Date : 28-12-2023 - 9:12 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ఎన్నికలపైనే (AP Elections) ఇప్పుడు అందరి దృష్టి..రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుందో..? ప్రజలకు ఎవరికీ పట్టం కడతారో ..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్ (Producer Natti Kumar ) ..రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి (TDP-Janasena) భారీ విజయం సాదించబోతుందని జోస్యం తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని, వైసీపీ కి 29 సీట్లు మాత్రమే రాబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన పొత్తును స్వాగతిస్తున్నట్లు సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. త్వరలోనే తాను టీడీపీ అధినేత చంద్రబాబు కలవబోతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం తన రాజకీయ కార్యచరణను ప్రకటిస్తానని నట్టికుమార్ తెలిపారు. అలాగే వర్మ ఫై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వర్మ ఏదీ ఫ్రీగా తీయరని.. డబ్బులు ఇస్తేనే సినిమా తీస్తారని .. వైసీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు కాబట్టే వ్యూహం సినిమా తీశాడని చెప్పుకొచ్చారు. వైసీపీ డబ్బులు ఇచ్చి సినిమా తీయించుకుంది కాబట్టి వైసీపీ పట్ల వర్మ ఖచ్చితంగా సానుభూతి ఉంటుందని చెప్పుకొచ్చారు. వర్మ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకోవడం పొరపాటు అని చెప్పుకొచ్చారు. సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పుకొచ్చారు.
Read Also : AP : వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే..!!