HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Amberpet Ci Sudhakar Granted Bail In Land Cheating Case

Amberpet CI Sudhakar: అంబర్‌పేట సీఐ సుధాకర్‌ కు బెయిల్‌ మంజూరు

భూ మోసం కేసులో అరెస్టయిన అంబర్‌పేట సీఐ సుధాకర్‌ (Amberpet CI Sudhakar)కు హయత్ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమి ఇస్తానని మోసం చేసిన కేసులో అరెస్టయిన సీఐ సుధాకర్‌ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

  • Author : Gopi Date : 14-01-2023 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CI
Resizeimagesize (1280 X 720) (1)

భూ మోసం కేసులో అరెస్టయిన అంబర్‌పేట సీఐ సుధాకర్‌ (Amberpet CI Sudhakar)కు హయత్ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమి ఇస్తానని మోసం చేసిన కేసులో అరెస్టయిన సీఐ సుధాకర్‌ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనాథ్ కుమార్ అనే వ్యక్తిని భూముల వ్యవహారంలో మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అంబర్ పేట సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సీఐ సుధాకర్‌, ఆర్‌ఐ రాజేష్‌పై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో రెండ్రోజుల క్రితం కేసు నమోదైంది. తమకు భూమి ఇప్పిస్తానని ఆర్ఐ రాజేష్ రూ.50 లక్షలు తీసుకున్నాడని బాధితుడు ఎన్నారై ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read: Gold Price Today: పండగ పూట బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. అయితే ధరలు ఇవే..!

తాను చెప్పిన ప్రదేశంలో భూమిని కొంటే, భవిష్యత్తులో దాని విలువ మరింత పెరుగుతుందని సీఐ ఆ ఎన్నారైని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఓ నకిలీ ఎమ్మార్వోను రంగంలోకి దింపి, అతడు త్వరలోనే ఆర్డీవో అవుతాడంటూ ఆ ఎన్నారైకి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. రూ.54 లక్షలు తీసుకున్న తర్వాత, సీఐ తదితరులు మొహం చాటేశారని, భూమి ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించారని ఆ ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు తీసుకుని నెలల తరబడి భూమి ఇవ్వకపోవడంతో బాధితుడు వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

పలు ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ఆర్‌ఐ రాజేష్‌ ఎమ్మార్వో పేరుతో నకిలీ ఐడీ కార్డును సృష్టించి పదోన్నతుల ద్వారా త్వరలో ఆర్డీఓ అవుతానని బాధితులను నమ్మించాడు. ఆ తర్వాత తాను తీసుకున్న డబ్బును సీఐ సుధాకర్‌కు ఇచ్చాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమిని అమ్మేందుకు డబ్బులు తీసుకున్నా.. నెలలు గడుస్తున్నా భూమికి రిజిస్ట్రేషన్ చేయలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amberpet CI Sudhakar
  • CI Sudhakar
  • Granted Bail
  • hyderabad
  • Land Cheating Case
  • RI Rajesh

Related News

Commercial Shops

తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి, కాంప్లెక్స్‌లలోని నివాసితుల సంక్షేమ సంఘాలకు ఆదాయాన్ని నిర్ధారించడానికి శాఖ ఈ దుకాణాలను వేలం వేయాలని నిర్ణయించింది.

  • Dating Apps Hyderabad

    Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

  • Software employee Ishika Yadav

    ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • Gas Uttam

    LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Latest News

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

  • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd