HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Akbaruddin Defends Owaisi Institutions Amid Demolition Threats

Hydra Demolition: అక్రమ కట్టడాలను సమర్ధించుకుంటున్న ఒవైసీ, కావాలంటే నన్ను కాల్చేయండి

అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఎంఐఎం విద్యార్థులకు విద్య అందించడం ద్వారా కొంతమందిలో అసూయను రేకెత్తిస్తున్నాయి అని అక్బరుద్దీన్ మండిపడ్డారు. నిరుపేదల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారని అసహనం వ్యక్తం చేశారు

  • By Praveen Aluthuru Published Date - 04:03 PM, Mon - 26 August 24
  • daily-hunt
Owaisi ON Hydra Demolition
Owaisi ON Hydra Demolition

Hydra Demolition: హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ద్వంద వైఖరి ప్రదర్శిస్తుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసి హైడ్రా కూల్చివేతలపై స్పందించాడు. ప్రభుత్వ కార్యాలయాలను, అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హైడ్రా కూల్చివేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాను స్థాపించిన సంస్థల కూల్చివేతకు వాదిస్తున్న వారిని విమర్శించారు.

అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఎంఐఎం విద్యార్థులకు విద్య అందించడం ద్వారా కొంతమందిలో అసూయను రేకెత్తిస్తున్నాయి అని అక్బరుద్దీన్ మండిపడ్డారు. నిరుపేదల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్కాలని నిర్ణయించుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒవైసీ అక్రమ భూమిని ఆక్రమించాడా అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించానని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఆస్తుల గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ కొందరు కావాలనే తమపై విషం కక్కుతున్నట్లు ఆయన తెలిపారు.

తన ప్రత్యర్థులను ఖండిస్తూ“ఎవరైనా నాతో శత్రుత్వం కలిగి ఉంటే, వచ్చి నన్ను కత్తులు మరియు తుపాకీలతో చంపండి. కానీ నా మంచి పనిని ఆపడానికి ప్రయత్నించవద్దు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు అక్బరుద్దీన్. గతంలో అనేక దాడుల నుండి బయటపద్దానని చెప్పాడు. “నాపై కత్తులతో దాడి చేయండి, కానీ మంచి పనిని నాశనం చేయవద్దు,” అని ఆయన అభ్యర్ధించారు. గతంలో జరిగిన దాడుల మచ్చలను భరించిన ఒవైసీ.. తాను ఎప్పుడూ తన శత్రువులను ధీటుగా ఎదుర్కొంటానని ఉద్ఘాటించారు. ఇదే వ్యవహారంలో అతని సోదరుడు అసదుద్దీన్ ఒవైసి కూడా స్పందించారు. బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను, అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

ఇదిలా ఉండగా హైడ్రా నగరంలోని ఎఫ్‌టిఎల్ భూములు మరియు సరస్సుల బఫర్ జోన్‌లలో నిర్మించిన భవనాలపై కూల్చివేతలను నిర్వహిస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిధిలో ఆక్రమణకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నది. హైడ్రా త్వరలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. హైడ్రా టార్గెట్ రాజకీయ నాయకుల అక్రమాలపైనేనని కొందరు భావిస్తున్నారు.

Also Read: LRS : ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12 Buildings
  • Akbaruddin
  • asaduddin owaisi
  • hyderabad
  • HYDRA demolition
  • Owaisi institutions
  • telugu news

Related News

Kaveri Travels

Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్

  • Liquor Shop

    Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!

  • Kurnool Bus Accident

    Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

  • Kurnool Bus Fire

    Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

  • AI Curriculum

    AI Curriculum: ఇక‌పై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్

Latest News

  • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

  • Chhathi Worship: ఛ‌ట్ పూజ చేస్తున్నారా? అయితే ఈ దేవ‌త ఆరాధ‌న మ‌ర్చిపోవ‌ద్దు!

  • Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ప‌ట్టు త‌గ్గిపోయిందా? గ‌ణాంకాలు ఇవే!

  • SSMB 29 Update: మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ.. లీక్ వ‌దిలిన త‌న‌యుడు!

  • Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి

Trending News

    • CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

    • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

    • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

    • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

    • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd