Rachana Reddy Joined BJP: బీజేపీ లో చేరిన రచనా రెడ్డి
కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సమక్షంలో
- By Balu J Published Date - 03:57 PM, Tue - 2 August 22

కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సమక్షంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి, పలువురు కార్యకర్తలు చేరారు. వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు గజేంద్ర సింగ్ షెకావత్. ఆపరేషన్ ఆకర్ష్ తో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేర్చుకోగా, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి కమలం కండువా కప్పుకున్నారు.
ఇటీవల రచనా రెడ్డి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు, బీజేపీ చేరేందుకు నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ చేరిక విషయమై నిజం చేస్తూ యాదగిరి గుట్టలో జరిగిన కార్యక్రమంలో రచనారెడ్డి కమలం తీర్థం పుచ్చుకున్నారు. రచనా రెడ్డి న్యాయవాదిగా తనదైన ముద్ర వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రచనా రెడ్డి వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు కూడా. రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీ వైపు రచనా రెడ్డి మొగ్గు చూపుతున్నారు.