HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Action Against Ktr Is Not Wrong Mlc Kodandaram

Formula-E Race Case : కేటీఆర్‌పై చర్యలు తప్పేం కాదు: ఎమ్మెల్సీ కోదండరాం

ఫార్ములా వన్ రేసు తొందరపాటు నిర్ణయం కాదని.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఫార్ములా వన్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని ఆయన అన్నారు.

  • Author : Latha Suma Date : 20-12-2024 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Action against KTR is not wrong: MLC Kodandaram
Action against KTR is not wrong: MLC Kodandaram

Formula-E Race Case : ఫార్ములా వన్ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ..కేటీఆర్‌పై చర్యలు తీసుకోవడం తప్పేం కాదని అన్నారు. క్యాబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా వన్ రేసు కోసం ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. ఫార్ములా వన్ రేసు తొందరపాటు నిర్ణయం కాదని.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఫార్ములా వన్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని ఆయన అన్నారు.

కాళేశ్వరం ఇలా ఎందుకు అయ్యిందో విచారణకు వచ్చి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పాల్సిందేనని కోదండరాం అన్నారు. కాళేశ్వరం విచారణకు రావడం కేసీఆర్ బాధ్యత అని చెప్పారు. పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అన్ని డబ్బులు ఖర్చు చేసినా డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం పనికిరాదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేయాలనే డిమాండ్‌కి రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని నమ్ముతున్నానని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్ముల్ ఈ- రేసింగ్ కేసులో.. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది.

Read Also: Amaravati : అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ రుణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Government
  • Formula E race Case
  • kaleshwaram project
  • kcr
  • ktr
  • MLC Kodandaram

Related News

Do not stop traffic for the CM or VIP convoy

Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ టూర్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ గురించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్పెషల్‌గా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయన

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd