Amaravati : అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ రుణం
World Bank : తాజాగా ప్రపంచ బ్యాంకు(World Bank) కూడా రాజధాని నిర్మాణానికి 6,800 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది
- By Sudheer Published Date - 12:50 PM, Fri - 20 December 24

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస శుభ వార్తలే అందుతున్నాయి. కేంద్రం తో పొత్తు పెట్టుకోవడం తో రాష్ట్ర అభివృద్ధి మరింత స్పీడ్ అందుకుంది. పెండింగ్ లో ఉన్న అన్ని పనులు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. మరోపక్క మంత్రి లోకేష్ సైతం రాష్ట్రానికి పెద్ద ఎత్తున సంస్థలను తీసుకొచ్చి నిరుద్యోగుల్లో ఆనందం నింపుతున్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు అమరావతికి భారీ రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం అమరావతి(Amaravati )కి 6,700 కోట్ల రూపాయల రుణం ఇప్పటికే ఏడీబీ నుంచి అందుకున్నది. తాజాగా ప్రపంచ బ్యాంకు(World Bank) కూడా రాజధాని నిర్మాణానికి 6,800 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రధాన సంస్థల నుంచి మొత్తం 13,500 కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించింది.
అమరావతి నిర్మాణ పనులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఆర్డీఏకి (Capital Region Development Authority) 33,137.98 కోట్ల రూపాయల విలువైన 45 ఇంజినీరింగ్ పనుల్ని ఆమోదించింది. ఇందులో భాగంగా ఐఏఎస్, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, రహదారులు, వరద నివారణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు వంటివి ఉంటాయి. ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేయడం కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవల ప్రభుత్వానికి అమరావతి నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. గతంలో హడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీలోని కేఎఫ్‌డబ్ల్యూలో నుంచి 5,000 కోట్లు రుణాలు తీసుకోవడానికి సీఆర్‌డీఏకి అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాజధాని అమరావతి మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు మరియు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెల్లడించారు. వచ్చే జనవరిలో 62,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం ముమ్మరం అవుతోంది. రాజధాని అమరావతిని వేగంగా నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థలు సమన్వయం తో పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.
Read Also : Weight Loss: పొట్ట తగ్గాలంటే మధ్యాహ్నం అన్నానికి బదులుగా వీటిని తినాల్సిందే?