Aarogyasri Card : ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వైద్యం.. లబ్ధిదారులు ఇవి గుర్తుంచుకోవాలి
Aarogyasri Card : రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవల కవరేజీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10 లక్షల రూపాయలకు పెంచారు.
- By Pasha Published Date - 08:44 AM, Fri - 8 December 23

Aarogyasri Card : రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవల కవరేజీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10 లక్షల రూపాయలకు పెంచారు. డిసెంబర్ 9 నుంచి సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఇది అమల్లోకి రాబోతోంది. రేపటి (శనివారం) నుంచి తెలంగాణవ్యాప్తంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని పొందొచ్చు. ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేందుకు లబ్ధిదారులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు తమతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును తీసుకెళ్లాలి.డాక్టర్లు హెల్త్ చెకప్స్ చేసి అనారోగ్య సమస్యల్ని గుర్తిస్తారు. వాటికి చికిత్స చేయించుకుంటారా అని అడుగుతారు. ఏయే ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి వస్తాయో అక్కడి ప్రత్యేక విభాగం వివరిస్తుంది. మీ ఆపరేషన్ కోసం ఎంత ఖర్చవుతుందో ఆరోగ్యశ్రీ కార్డు రిపోర్టుల్లో నమోదు చేస్తారు. ఉదాహరణకు రూ.3లక్షల దాకా ఖర్చయితే.. మరో రూ.7 లక్షల దాకా ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉంది. ఈ కార్డు కింద లబ్దిదారులకు ఉచిత వైద్యం, ఉచిత మందుల సరఫరా, ఉచిత టెస్టులు, ఉచిత ఆహారం వంటివి అందిస్తారు. గత తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రూ.5లక్షల వరకూ ఉచిత వైద్య సదుపాయాలు అందించేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని డబుల్ చేసి, రూ.10 లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ పథకం కింద 1,672 రకాల చికిత్సలు చేయించుకోవచ్చు. 104 లేదా 14555 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి ఈ స్కీమ్(Aarogyasri Card) వివరాలు తెలుసుకోవచ్చు.