HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Aadhaar Problems For Women In Telangana Rtc Buses

Aadhaar: ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఆధార్ ఇబ్బందులు.. ఉచిత ప్ర‌యాణంపై ఎఫెక్ట్

ఆధార్ కార్డు అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఈ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చాలా కీలకం.

  • Author : News Desk Date : 18-04-2025 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rtc Bus
Rtc Bus

Aadhaar: ఆధార్ కార్డు అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఈ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చాలా కీలకం. ప్రభుత్వ, ప్రవేట్ రంగం ఏదైనా ఆధార్ కార్డు తప్పని సరి. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. ఆధార్ కార్డును చూపించి మ‌హిళ‌లు రాష్ట్రంలో ఎక్క‌డి నుంచైనా ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం చేసేందుకు అవ‌కాశం ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆధార్ కార్డుల్లో రాష్ట్రం పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అని ఉండ‌టంతో ఆర్టీసీ సిబ్బంది మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించ‌లేక పోతున్నారు. దీంతో చాలా మంది మ‌హిళ‌లు ప్ర‌భుత్వం అందిస్తున్న ఆర్టీసీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక పోతున్నారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ కొంద‌రి ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అనే వస్తుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కంలో భాగంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న ప‌లువురు మహిళకు ఆధార్ కార్డులో తెలంగాణ అని లేదుకదా అనే మాట వినిపిస్తోంది. బస్సులో కండక్టర్ కు ఆధార్ చూపినప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దర్శమిస్తుండటంతో తెలంగాణ అని మార్చుకోవాలి కదా.. ఇలాఉంటే ఉచిత ప్ర‌యాణం స‌దుపాయం క‌ల్పించ‌లేం అంటున్నారు. ఉన్నతాధికారులు చెకింగ్‌కు వచ్చిన సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కండక్టర్లు, డ్రైవర్లు మహిళా ప్రయాణికులకు సూచిస్తున్నారు.

 

ప‌లు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రాలు లేవు. జిల్లా కేంద్రంలో మాత్రమే ఆధార్‌ల కరెక్షన్ చేసేందుకు ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు ఆధార్ సెంటర్‌కు వెళితే.. సరైన ధృవపత్రాలు లేవంటే కార్డులో సవరణలు చేయడం లేదు. నూతన ఓటర్ కార్డు, మీసేవ ద్వారా ధృవీకరించిన రెసిడెన్సి సర్టిఫికెట్ తీసుకువస్తేనే మార్పులకు అవకాశం ఉందని వారు బదులిస్తున్నారు. అన్ని ధ్రువ పత్రాలు తీసుకువెళ్లిన గంటల తరబడి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి.

 

తెలంగాణ రాష్ట్రం, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఓటరు కార్డులన్ని ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా మార్పులు జ‌రిగాయి. మరి ఆధార్ కార్డులు ఎందుకు అలా రావడం లేదు.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల‌ని పలువురు మహిళలు కోరుతున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలు ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం పేరు బ‌దులు ఏపీ రాష్ట్రం అని వ‌స్తుండ‌టంతో ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రభుత్వం ప్ర‌తీ మండ‌లానికి ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి.. ఆధార్ కార్డుల్లో మార్పులు చేయించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని, అలాకాకుంటే ఆటోమెటిక్‌గా మార్పు అయ్యేలా సంబంధిత యూఐడీఐ‌ సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించాలని పలువురు మహిళలు కోరుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar
  • RTC Buses
  • telangana
  • women

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd