Mahashivratri: మహా శివరాత్రి..వేములవాడ వెళ్లే భక్తులకు శుభవార్త
- By Latha Suma Published Date - 03:19 PM, Tue - 5 March 24

Mahashivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ (vemulawada) రాజన్న ఆలయం ఒకటి. మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మహా శివరాత్రి ఉండగా.. భక్తులకు టీఎస్ ఆర్టీసీ(TS RTC)గుడ్‌న్యూస్ చెప్పింది. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహా శివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ ఈడీ వినోద్ కుమార్ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 7న 7న 265, 8న 400, 9న 329 ప్రత్యకే బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, కామారెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుస్తాయని చెప్పారు. ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా 14 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.
read also : PM Modi : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు