HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth 11 Appeals To Pm Modi

PM Modi : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు

  • By Sudheer Published Date - 03:11 PM, Tue - 5 March 24
  • daily-hunt
Modi Revanth
Modi Revanth

తెలంగాణలో ప్రధాని మోడీ (Modi) రెండు రోజుల పర్యటన (Telangana Tour) ముగిసింది. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని మోడీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండగా… ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పాత ఆనవాయితీని కొనసాగించారు. నిన్న ఆదిలాబాద్‌లో ప్రధానిని పెద్దన్నయ్యగా సీఎం సంబోధించారు.

వీడ్కోలు సందర్భంగా పదకొండు అంశాలకు సంబంధించిన మెమొరాండంలను ప్రధాని మోడీ అందజేశారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసినప్పుడు వివరించిన అంశాలు, అందజేసిన విజ్జప్తుల్లోనే కొన్నింటిని మరోసారి తాజా పర్యటన సందర్భంగా అందజేశారు. అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఇందులో ఉన్నాయి.

ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు ఇవీ :

• హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించండి.

• తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి.

• హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ. 3 కోట్లు మంజూరు చేసింది. రూ. 7,700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తే అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులు, ఇటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కి.మీ దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి.

• ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం.

• రాష్ట్రంలో 100% ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి.

• తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి.

• హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.

We’re now on WhatsApp. Click to Join.

• భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల-మరికల్ ఫోర్ లేన్, మరికల్-డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.

• తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలి.

• ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) నెలకొల్పాలి. అందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.

• నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్త్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ. 347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి అని కోరారు.

Read Also :


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • pm modi

Related News

Trump

Trump: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌వ‌ర్త‌న‌పై అమీ బెరా కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవ‌రీ బెరా?!

నెలకొన్న ఉద్రిక్తతలను నిర్వహించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన సంయమనాన్ని డా. బెరా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

  • Musi Rejuvenation Will Solv

    Musi Rejuvenation : హైదరాబాద్ వరదలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్

  • Harishrao Hyd Floods

    Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

  • Hyderabad Metro

    HYD Metro : ప్రభుత్వ అధీనంలో మెట్రో

  • Election Schedule

    Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

Latest News

  • Telangana: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!

  • Periods: పీరియడ్స్ ప్ర‌తి నెలా స‌రైన స‌మ‌యానికి రావ‌డంలేదా? అయితే ఇలా చేయండి!

  • Hyderabad Floods: డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం

  • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

  • Harmanpreet Kaur: చ‌రిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవ‌కాశం: హర్మన్‌ప్రీత్ కౌర్

Trending News

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd