BRS Ex Shankar Naik : మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదు
BRS EX MLA Shankar Naik : భూకబ్జా వ్యవహారంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో శంకర్ నాయక్ పై కేసు నమోదు చేశారు
- By Sudheer Published Date - 11:01 AM, Thu - 21 November 24

మహబూబాబాద్ (Mahabubabad ) బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ (BRS Ex Shankar Naik ) మరోసారి వార్తల్లో నిలిచారు. శంకర్ నాయక్ కు వివాదాలు కొత్తేమి కాదు..మొదటి నుండి అనేక సందర్భాల్లో ఆయన వార్తల్లో నిలిచారు. అప్పటి సీఎం కేసీఆర్ నుండి కూడా చివాట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తీరులో మార్పులేదు.మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ చేతిలో ఓటమి చెందారు. శంకర్ నాయక్ ఓడిపోవడం గ్యారెంటీ అని ముందు నుండి అంత చెపుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన ఫై పూర్తి వ్యతిరేకత ఉందని..భూకబ్జా లు , ఉద్యోగులపై ఒత్తిడి..సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం ఇలా చాల వాటిల్లో ఆయనపై వ్యతిరేకత ఉంది..కేసీఆర్ కు సైతం బిఆర్ఎస్ నేతలు శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వద్దని..ఇస్తే సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చి బోల్తా పడ్డాడు.
గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయనపై తాజాగా కేసు నమోదైంది. భూకబ్జా వ్యవహారంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో శంకర్ నాయక్ పై కేసు నమోదు చేశారు. నగరంలోని వినాయకనగర్ లోని దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని శంకర్ నాయక్ కబ్జా చేసేందుకు యత్నించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. స్థల యజమానులకు చెందిన కంటైనర్‌తో పాటు గృహపకరణ వస్తువులను దొంగలించిన విషయంలో శంకర్ పై పలు సెక్షన్‌లలో పోలీసులు కేసు నమోదు చేసారు. బాధితులపై దాడి చేసి, సెల్ ఫోన్లు లాక్కున్నారని ఆరోపణలు చేయడంతో వీటిపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు.
Read Also : Engineering Colleges : 40 ఇంజినీరింగ్ కాలేజీలకు ‘అటానమస్’.. తెలంగాణ సర్కారు విచారణ ?