Hyderabad: హైదరాబాద్లో ఒక్కరోజే 15 వేల మంది కొత్త ఓటర్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిన్న అక్టోబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు.
- Author : Praveen Aluthuru
Date : 01-11-2023 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిన్న అక్టోబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజే 15 వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.
మొత్తం ఫారం 6 దరఖాస్తుల సంఖ్య 1.35 లక్షలకు చేరిందని, అందులో 83 వేల దరఖాస్తులను ధృవీకరించినట్లు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. దీంతో నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 45 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ స్టిక్కర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత ఓటరు సమాచార కరపత్రాన్ని కూడా ఓటర్లకు అందజేస్తామని రోనాల్డ్ రాస్ తెలిపారు.
Also Read: King Nagarjuna: ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది: కింగ్ నాగార్జున