HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >1000 Crore Investment For Telangana

KTR: తెలంగాణకు రూ.1000 కోట్ల పెట్టుబడి – ‘కేటీఆర్’

  • By hashtagu Published Date - 01:30 PM, Thu - 24 March 22
  • daily-hunt
56
56

ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. గురువారం అమెరికాలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్ మరియు సీఈఓ మనీష్ కుమార్ ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టంని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రారంభించనుంది. ఫిష్ ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని కంపెనీ సీఈఓ మనీష్ కుమార్ తెలిపారు. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారీ పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడి తో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అంది వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అధికంగా ఉన్న తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమ పై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు. చేపల పెంపకానికి సంబంధించి ఇప్పటికే వారి వద్ద ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కంపెనీ సీఈవో మనీష్ కి సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • telangana

Related News

Ktr Rahul Mlas

KTR Tweet : రాహుల్.. మీకు సిగ్గనిపించడం లేదా..? – KTR

KTR Tweet : "డియర్ రాహుల్ గాంధీ.. ఈ ఫోటోను చూడండి. కాంగ్రెస్ కండువాలను, ఢిల్లీలో మిమ్మల్ని కలిసిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను గుర్తుపట్టారా? ఇప్పుడు వీరు తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? ఇది ఓట్ చోరీ కాదా? మీకు సిగ్గు అనిపించడం లేదా?"

  • Caste Certificates

    Caste Certificates: తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు.. ప్రాసెస్ ఇదే!

  • Ktr Ponnam

    KTR : ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం – పొన్నం

  • Harish Rao

    Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు

  • Chandrababu's speed in AP's development: Malla Reddy praises

    Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు

Latest News

  • Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

  • Engineering Colleges : సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

  • Asia Cup 2025: ఎల్లుండి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. పిచ్ ప‌రిస్థితి ఇదే!

  • AP Medical Colleges : YCP వల్లే వైద్య కళాశాలల్లో ఈ దుస్థితి – మంత్రి అనిత

  • Vishnu – Manoj : అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అన్న ఏంటో ‘మంచు ప్రేమ కథ ‘

Trending News

    • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

    • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

    • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

    • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

    • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd