Tech : భవిష్యత్తులో ఇలాంటి స్మార్ట్ ఫోన్ వస్తుందేమో.? డిజైన్ చూస్తే షాక్ అవుతారు..!!
- By hashtagu Published Date - 06:11 PM, Sun - 20 November 22

ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్స్ తోపాటు డిజైన్లతో స్మార్ట్ ఫోన్లు యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.కానీ భవిష్యత్తులో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. వాటి డిజైన్లు ఎలా ఉండబోతున్నాయి. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవడం గ్యారెంటీ.
ఈ వీడియో చూడండి. స్మార్ట్ ఫోన్ ఎలా కనిపిస్తుంది. జస్ట్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది కదా. చేతిలో ఏదో గాజుపలకను పట్టుకున్నట్లు దానిపై మిలమిలా మెరిసే యాప్స్ కనిపిస్తున్నాయి. ఇది ట్రాన్స్ పరేంట్ డిజైన్ తోపాటు ఆపరేట్ చేయవచ్చు. దీని ఆపరేటింగ్ సిస్టమ్ MIUIలా కనిపిస్తుంది. అయితే షియోమీ అలాంటి కాన్సెప్ట్ ఫోన్లో పనిచేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ట్రాన్స్ పరేంట్ ఫోన్ డిజైన్ చూడటం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా దీన్ని డిజైన్ చేశారు.
A transparent smart phone design pic.twitter.com/9iXstC7jXN
— Vala Afshar (@ValaAfshar) April 5, 2022
బ్యాటరీ
ఈ ట్రాన్స్ పరేంట్ డిజైన్ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ ఉండదు. దాన్ని వైర్ లెస్ ఛార్జర్ కూడా ట్రాన్స్ పరేంట్ గా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. వైర్ లెస్ ఛార్జింగ్, బ్యాటరీ లేకుండా ఉండే ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆట్టుకోవడం ఖాయం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పట్లో లాంచ్ కావడంలేదు. ఏ కంపెనీ తయారు చేస్తుందన్న దానిపై కూడా క్లారిటీ లేదు.