HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Whatsapp Will Let You Prevent Others From Auto Saving Media You Send Them

WhatsApp New Feature: వాట్సాప్‌లో మీరు పంపే ఫైళ్లు సేవ్ కావొద్దా ? ఇదిగో ఫీచర్

మనం నిత్యం వాట్సాప్‌లో ఎంతోమందికి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను(WhatsApp New Feature) పంపుతుంటాం.

  • Author : Pasha Date : 05-04-2025 - 5:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Auto Saved Media New Feature Auto Saving Media Whatsapp Privacy

WhatsApp New Feature: ప్రస్తుతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇది తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈక్రమంలోనే మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. దీనివల్ల యూజర్ల ప్రైవసీకి అదనపు రక్షణ లభిస్తుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?

ప్రైవసీ సెట్టింగ్స్ విభాగంలో.. 

మనం నిత్యం వాట్సాప్‌లో ఎంతోమందికి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను(WhatsApp New Feature) పంపుతుంటాం. ఎంతోమంది నుంచి మనకు కూడా అవి అందుతుంటాయి. మనం పంపే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అవతలి వారు ఇప్పటివరకు సేవ్ చేసుకోగలిగేవారు. అయితే ఇకపై ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే.. మనం పంపే ఫైళ్లను రిసీవ్ చేసుకున్న వారు, వాటిని  సేవ్ చేసుకోకుండా నియంత్రించే ఫీచర్ త్వరలోనే వాట్సాప్‌లో మన ముందుకు రాబోతోంది. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఆప్షన్  వాట్సాప్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఉంటుంది.  ఈ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకున్నప్పుడు,  అవతలి వ్యక్తులు మన నుంచి పొందే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను సేవ్ చేసుకోవడం కుదరదు. వాళ్లు మన ఫైళ్లను సేవ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ‘సేవ్‌ చేయడం కుదరదు’ అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.

ఆ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుంటేనే.. 

మనం ఈ కొత్త ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకుంటే.. మనం పంపే ఫైళ్లను అవతలి వారు సేవ్‌ చేసుకోగలుగుతారు.  దీనివల్ల ఇతరులు మన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే స్క్రీన్ షాట్ ద్వారా ఈ సమాచారాన్ని కొంతమేర తస్కరించే వీలు ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సైతం వాట్సాప్ ఏదైనా విరుగుడును తయారు చేయాలని వాట్సాప్ యూజర్లు కోరుతున్నారు.ఈ కొత్త ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని.. బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్‌ అయిన యూజర్లకు సైతం ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిసింది.

Also Read :New BJP Chief: రామ్ మాధవ్‌కు బీజేపీ చీఫ్ పదవి ? కారణాలు బలమైనవే !

అడ్వాన్స్‌ ఛాట్ ప్రైవసీ

ఎక్స్‌పోర్ట్‌ ఛాట్‌ హిస్టరీ విషయంలోనూ వాట్సాప్ యూజర్లకు మరో ప్రైవసీ ఫీచర్‌ను వాట్సాప్ అందించబోతోంది. అడ్వాన్స్‌ ఛాట్ ప్రైవసీని ఆన్‌ చేసుకుంటే, అవతలి వ్యక్తులు ఆ మెసేజ్‌లను ఎక్స్‌పోర్ట్‌ చేయలేరు.

వన్‌టైమ్‌ సెండ్‌ ఆప్షన్‌

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌టైమ్‌ సెండ్‌ ఆప్షన్‌ ద్వారా కూడా ఈవిధంగా చేయొచ్చు. అయితే ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నాక.. మనం పంపే ఫైళ్లను అవతలి వారు ఒకసారి మాత్రమే చూడగలరు.

డిసప్పియరింగ్ ఫీచర్‌

ప్రస్తుతం డిసప్పియరింగ్ ఫీచర్‌ ద్వారా నిర్ణీత సమయం దాటిన తర్వాత మెసేజ్‌లు, ఛాట్‌లు తొలగిపోయేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Auto Saved Media
  • Auto Saving Media
  • whatsapp
  • whatsapp feature
  • whatsapp new feature
  • WhatsApp Privacy

Related News

    Latest News

    • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

    • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd