WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్ మెసేజెస్ టెక్స్ట్ రూపంలో మార్చుకోవచ్చట!
మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ తాజాగా వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
- By Anshu Published Date - 12:03 PM, Sun - 19 January 25

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది m వాట్సాప్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అందుకు గల కారణం వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్స్. ఇప్పటికే పదుల సంఖ్యలో ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్ లో ఉన్న ఒక సమస్యకు చెక్ పెట్టడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే..
ఎప్పుడైనా ఏదైనా పనుల్లో ఉన్నప్పుడు మెసేజ్ టైప్ చేయడానికి సమయం లేదు అనుకున్నప్పుడు వెంటనే వాయిస్ మెసేజ్ లు పెడుతూ ఉంటాము. అలాగే అవతలి వ్యక్తులు కూడా వాయిస్ మెసేజ్ పంపుతూ ఉంటారు. అయితే అవతలి వ్యక్తి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు ఏదైనా మీటింగ్స్ లేదా కొన్ని బిజీ పనుల్లో ట్రాఫిక్ లో ఉన్నప్పుడు అవి సరిగా వినిపించవు. ఆ వాయిస్ మెసేజ్లను వినాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ పంపిన వాయిస్ మెసేజ్ ఏదైనా అర్జెంట్ మేటర్ అయిన అప్పుడు వినలేని పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు వినిపించదు. అయితే దీనికి సొల్యూషన్ గా వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లని టెక్స్ట్ రూపంలో మార్చే ట్రాన్స్క్రిప్ట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ట్రాన్స్‌క్రిప్ట్ ఆప్షన్.. మీకు వచ్చే వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలోకి మార్చి చూపిస్తుందట.
అది కూడా ఒక్క సెకండ్ లోపేనట. కాగా ప్రస్తుతానికి నాలుగు భాషల్లో ఈ సదుపాయం కల్పించింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, పోర్చుగీస్ భాషల్లో ఈ ట్రాన్స్క్రిప్ట్ అందుబాటులో ఉంది. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్ అనే ఆప్షన్ లో మెసేజెస్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ లపై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే మీకు వచ్చే ఆప్షన్స్ లో మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని వస్తుంది. సింపుల్ గా దాని పైన క్లిక్ చేస్తే మీ వాయిస్ మెసేజ్ మొత్తం దాని కింద టెక్స్ట్ రూపంలో మీకు కనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్ గా ఈ ఫీచర్ ప్రస్తుతానికి పనిచేస్తుంది. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని వాట్సప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు నిజంగా చెక్ పెట్టినట్టే అని చెప్పాలి.