Whatsapp Sticker : వాట్సాప్ స్టిక్కర్, గిఫ్ లపై సరికొత్త అప్ డేట్
Whatsapp Sticker : వాట్సాప్ మరో రెండు అప్ డేట్స్ చేసింది. స్టిక్కర్ ట్రేతో పాటు GIF పిక్కర్‌ను రీడిజైన్ చేసింది.
- By Pasha Published Date - 12:31 PM, Sun - 9 July 23

Whatsapp Sticker : వాట్సాప్ మరో రెండు అప్ డేట్స్ చేసింది.
స్టిక్కర్ ట్రేతో పాటు GIF పిక్కర్‌ను రీడిజైన్ చేసింది.
కీ బోర్డు నుంచి ఈజీగా స్టిక్కర్స్, GIFలను పొందేలా.. ఈజీగా వాటిని సెర్చ్ చేయగలిగేలా నావిగేషన్ లో వాట్సాప్ మార్పులు చేసింది.
ఇంతకుముందు వాట్సాప్ స్టిక్కర్ ట్రేలోకి ఎంటర్ అయిన తర్వాత.. స్టిక్కర్స్ ను వెతికే క్రమంలో పైకి స్క్రోల్ చేసే సౌలభ్యం ఉండేది కాదు. కొత్త అప్ డేట్ లో భాగంగా త్వరలోనే.. పైకి ఈజీగా స్క్రోల్ చేస్తూ స్టిక్కర్స్ ను చూసే సౌలభ్యం వాట్సాప్ యూజర్స్ కు అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు GIF, స్టిక్కర్, అవతార్ సెక్షన్లను(Whatsapp Sticker) యాక్సెస్ చేయడానికి ఉపయోగించే బటన్‌లను కూడా మార్చారు.వాటిని ట్యాబ్‌ల తరహాలో రీడిజైన్ చేశారు.
Also read : T Trains Coming Soon : స్టీమ్ ఇంజన్ కాని స్టీమ్ ఇంజన్ తో “టీ ట్రైన్స్”.. రాయల్ ఫీచర్స్ తో ఎంట్రీ
ఫలితంగా వాట్సాప్ లోని GIF, స్టిక్కర్, అవతార్ సెక్షన్లకు స్పష్టమైన నావిగేషన్ ఉంటుంది. WhatsApp అవతార్ ప్యాక్‌లను రకాన్ని బట్టి వివిధ విభాగాలుగా విభజించారు. వినియోగదారులకు పెద్ద అవతార్ స్టిక్కర్ లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. ఇంకొన్ని వారాల్లో ఈ అప్ డేట్స్ అన్నీ వాట్సాప్ లో వచ్చేస్తాయి. WhatsApp చాట్ లిస్ట్‌లోనే ఈజీగా చాట్స్ ను ఫిల్టర్ చేసేందుకు ఉపయోగపడే ఒక ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఇది కూడా ఇంకొన్ని నెలల్లో అందుబాటులోకి వస్తుంది.