HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Whatsapp Look Change Coming Soon You Can Change The Theme Colors As You Like

WhatsApp Theme Color : వాట్సాప్‌కు ఇక మీకు నచ్చిన రంగు రుద్దొచ్చు!

WhatsApp Theme Color : వాట్సాప్ రంగులమయం కాబోతోంది.  త్వరలోనే మనం వాట్సాప్​ థీమ్​ను మనకు నచ్చిన రంగు​లోకి మార్చుకునే అవకాశం ఉంటుంది.

  • By Pasha Published Date - 03:48 PM, Tue - 9 January 24
  • daily-hunt
Whatsapp Theme Color
Whatsapp Theme Color

WhatsApp Theme Color : వాట్సాప్ రంగులమయం కాబోతోంది.  త్వరలోనే మనం వాట్సాప్​ థీమ్​ను మనకు నచ్చిన రంగు​లోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో కేవలం లైట్​, డార్క్ మోడ్​లను మాత్రమే మార్చుకోగలుగుతున్నాం. అయితే వాట్సాప్​ బ్రాండింగ్ రంగు​ అయిన ప్రైమరీ గ్రీన్ కలర్​ మాత్రం మారడం లేదు. త్వరలో రాబోయే ‘యాప్​ కలర్​’ ఫీచర్ ఈ ప్రాబ్లమ్‌కు పరిష్కారాన్ని చూపబోతోంది. గ్రీన్​, బ్లూ, వైట్​, పింక్​, పర్పుల్​ కలర్ ఆప్షన్లు మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. వాటితో మన వాట్సాప్ లుకింగ్ మారిపోతుంది. ఇక చాట్ విండోలో బబుల్ రంగును కూడా మార్చేయొచ్చు. ఆ తర్వాత క్రమంగా మరిన్ని రంగులను ‘యాప్ కలర్’ విభాగంలో వాట్సాప్ జోడిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్​ ఐవోఎస్ బీటా వెర్షన్​ 24.1.10.70లో ‘యాప్​ కలర్​’ ఫీచర్​ను టెస్ట్ చేస్తున్నారు. అయితే దీన్ని ఇంకొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం టెస్టింగ్ కోసం అందుబాటులోకి తెచ్చే ఛాన్స్(WhatsApp Theme Color) ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

వాట్సాప్​లో త్వరలో మనకు యూజర్ నేమ్ ఫీచర్ తీసుకురాబోతోంది. అంటే మన ఫోన్ నంబర్ ప్లేస్‌లో  యూజర్ నేమ్ కనిపిస్తుంది. యూజర్ నేమ్ ఉండడం వల్ల ఎవరైనా మనల్ని సులువుగా గుర్తుపడతారు. సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. యూజర్​ నేమ్ వల్ల యూజర్ల వ్యక్తిగత భద్రతకు, ప్రైవసీకి ఆటంకం కలగదు. ఫోన్ నంబర్ల కంటే, యూజర్​ నేమ్స్ షేర్​ చేయడం చాలా ఈజీ. డిజిటల్ ప్లాట్​ఫామ్స్​లో యూజర్లను కనెక్ట్ చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

Also Read: Arjuna Awards : చిరాగ్ శెట్టి, రంకిరెడ్డిలకు ఖేల్ రత్న.. ష‌మీ, అజయ్ కుమార్‌లకు అర్జున ప్రదానం

మరో అద్భుతమైన కొత్త అప్‌డేట్‌‌ను వినియోగదారులకు వాట్సాప్ అందించనుంది.  ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు వీడియో కాల్ కనెక్ట్ అయిన సమయంలో మ్యూజిక్ ఆడియోను షేర్ చేసుకునేందుకు వీలవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను బీటా వినియోగదారులతో పరీక్షిస్తున్నారు. వీడియో కాల్‌లో ఉన్నవారు తమ స్క్రీన్ షేర్ చేసినప్పుడు, వారి మొబైల్‌లో ప్లే చేసే ఆడియో మరొకరికి కూడా షేర్ అవుతుంది. ఈ ఫీచర్ ఒకరికొకరు కాల్‌లో ఉన్న సమయంలోనే కాకుండా గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మరికొద్ది వారాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. మొత్తం మీద న్యూ ఇయర్‌లోనూ వాట్సాప్ కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • whatsapp
  • WhatsApp Theme Color
  • WhatsApp User Name

Related News

    Latest News

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

    • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

    • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd