Whatsapp Logout Feature : వాట్సాప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తుంది
Whatsapp Logout Feature : ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్షలు జరుపుకుంటోంది. యూజర్లు తమ ప్రైమరీ డివైస్ నుంచి లాగౌట్ కావాలంటే ఇప్పటివరకు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం లేదా ఖాతాను డిలీట్ చేయడం తప్ప మరో మార్గం లేదు
- Author : Sudheer
Date : 30-05-2025 - 12:54 IST
Published By : Hashtagu Telugu Desk
వాట్సాప్ (Whatsapp ) యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘లాగౌట్’ ఫీచర్ (Logout Feature) త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్షలు జరుపుకుంటోంది. యూజర్లు తమ ప్రైమరీ డివైస్ నుంచి లాగౌట్ కావాలంటే ఇప్పటివరకు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం లేదా ఖాతాను డిలీట్ చేయడం తప్ప మరో మార్గం లేదు. లింక్డ్ డివైసులకే లాగౌట్ సదుపాయం ఉండగా, ప్రధాన డివైస్‌కి ఈ సౌలభ్యం ఉండేది కాదు. అయితే, త్వరలోనే సెటింగ్స్‌లో అకౌంట్ మెనూ ద్వారా లాగౌట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ లాగౌట్ ఆప్షన్‌పై క్లిక్ చేసినప్పుడు మూడు ఎంపికలు కనిపించనున్నాయి. మొదటిది “Erase all data & preferences”, ఇది యాప్ డేటా, చాట్స్, మీడియా అన్నింటినీ పూర్తిగా తొలగిస్తుంది. రెండవది “Keep all data & preferences”, దీని ద్వారా డేటా యథావిధిగా ఉండి లాగౌట్ అవ్వొచ్చు – మళ్లీ లాగిన్ అయినప్పుడు డేటా వెంటనే తిరిగి లభిస్తుంది. చివరిది “Cancel”, అంటే లాగౌట్ ప్రక్రియను రద్దు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎంపికలు యూజర్లకు వారి అవసరానికి అనుగుణంగా డేటా నిలుపుకోవడంలో స్వేచ్ఛను ఇస్తాయి.
ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది కాబట్టి, ప్రారంభంగా బీటా టెస్టర్లకు అందుబాటులోకి రానుంది. ఇది యాప్‌ను తాత్కాలికంగా ఉపయోగించకపోయినా, డేటా కాపాడుకుంటూ డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో ఈ ఫీచర్‌కి మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు, UI మెరుగుదలలు కూడా రావొచ్చు. అధికారికంగా అందుబాటులోకి ఎప్పుడు వస్తుందనేది తేలాల్సి ఉంది కానీ, ఇది యూజర్ల కోసం నిజంగా వినూత్నమైన మార్గాన్ని అందించనుంది.
Canada: కెనడాలో కార్చిచ్చు..సురక్షిత ప్రాంతాలకు వేలమంది తరలింపు..!