WhatsApp Ads : వాట్సాప్‌లో ఇక యాడ్స్.. ఇలా డిస్‌ప్లే అవుతాయి
WhatsApp Ads : ఇప్పటిదాకా మీరు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ చూసి ఉంటారు.
- By Pasha Published Date - 10:40 AM, Sun - 12 November 23

WhatsApp Ads : ఇప్పటిదాకా మీరు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ చూసి ఉంటారు. ఇకపై వాట్సాప్‌లోనూ యాడ్స్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వాట్సాప్ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇకపై యాడ్స్ మొదలుపెట్టనుంది. ఈవిషయాన్ని స్వయంగా వాట్సాప్ కంపెనీ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ వెల్లడించారు. అయితే వాట్సాప్‌లో యాడ్స్ ఎలా కనిపిస్తాయి ? ఎక్కడెక్కడ ఈ యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి ? అనే దానిపై తాజాగా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. అందరూ అనుకుంటున్నట్టుగా.. వాట్సాప్ మెయిన్ ఛాట్ సెక్షన్‌లో మీకు యాడ్స్ కనిపించవు.
We’re now on WhatsApp. Click to Join.
వాట్సాప్‌లోని రెండు విభాగాలలో యాడ్స్‌ను డిస్‌ప్లే చేస్తారని తెలుస్తోంది. Instagram స్టోరీస్, Facebook స్టోరీస్ మధ్యమధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అదేవిధంగా వాట్సాప్ స్టేటస్‌ల మధ్యమధ్యలో యాడ్స్‌ను డిస్ ప్లే చేసే అవకాశం ఉంది. వాట్సాప్ ఛానల్స్‌లోనూ యాడ్స్‌ను నడపాలని భావిస్తున్నారు. అంటే వాట్సాప్ స్టేటస్‌లు, వాట్సాప్ ఛానల్స్‌లలోకి యాడ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అనేది క్లియర్ అయిపోయింది. బ్రెజిల్‌కు చెందిన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సాప్ కంపెనీ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ఈవివరాలను తెలిపారు. ఒకవేళ యాడ్స్‌ను చూడొద్దని భావించే వారి కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను వాట్సాప్ రెడీ చేస్తోందని అంటున్నారు. మొత్తం మీద వాట్సాప్ యాడ్స్‌ను తొలుత అమెరికా, కెనడాలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో వీటిని ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఇంకా(WhatsApp Ads) క్లారిటీ లేదు.