Whatsapp: మీకు ఇష్టం లేకపోయినా వాట్సాప్ గ్రూప్స్ లో యాడ్ చేసి విసగిస్తున్నారా.. ఇలా చేయండి?
మిమ్మల్ని ఎవరు పడితే వారు వాట్సాప్ గ్రూపులో యాడ్ చేసి విసిగిస్తుంటే సెట్టింగ్ ఆన్ చేయాల్సిందే అంటున్నారు నిపుణులు.
- By Anshu Published Date - 11:55 AM, Sun - 4 August 24

ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగంతో పాటు వాట్సాప్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు. వాట్సాప్ తో పాటు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకోవాల్సిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది.
అయితే చాలామంది వాట్సాప్ ను వినియోగిస్తున్నప్పటికీ అందులో ఉన్న ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. ఆ సంగతి అటుఉంచితే ఇటీవల కాలంలో వాట్సాప్ గ్రూప్స్ చాలామందిని వేధిస్తున్నాయి. అంటే వారి ప్రమేయం లేకుండానే అవతలివారు వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి మెసేజ్లు వచ్చి అనవసరంగా స్టోరేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇతరులు మనల్ని గ్రూప్ లో యాడ్ చేయకుండా ఏం చేయాలో చాలామందికి తెలియదు. మరి ఇతరులను మిమ్మల్ని వేధించకుండా ఉండాలి. గ్రూప్స్ లో యాడ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో చాలా మంది వినియోగదారులకు మెసేజ్‌లను పంపడానికి వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తున్నారు.
ముఖ్యంగా మొబైల్ నంబర్ లు సులభంగా అందుబాటులో ఉన్నందున చాలా వ్యాపారాలు, స్కామర్ లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి లేదా వ్యక్తులను మోసం చేయడానికి వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేస్తున్నారు. అయితే మనకు తెలియకుండానే మనల్ని గ్రూపులో యాడ్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అయితే ఇక మీదట ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్ లోకి యాడ్ చేయకుండా ఉండాలి అంటే యూజర్లు ఆల్ లేదా మై కాంటాక్ట్స్ ఆప్షన్ ని సెట్ చేసుకోవచ్చు. అయితే ముందుగా వాట్సాప్ హోమ్ పేజీకి వెళ్లి కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అక్కడ డ్రాప్ డౌన్ మెనూ నుంచి సెట్టింగ్‌లు ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అనంతరం ప్రైవసీ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ గ్రూప్స్ ను కిందకి స్క్రోల్ చేయాలి. అక్కడ హూ కెన్ యాడ్ గ్రూప్స్ ఆప్షన్ ఎంచుకుని, ఆల్ నుంచి మై కాంటాక్స్ ను ఎంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మన ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ మాత్రమే మనల్ని వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయగలరు. మనకు తెలియని వివిధ గ్రూపుల్లో యాడ్ చేసే అవకాశం ఉండదు.