WhatsApp Video Calls : వాట్సాప్ వీడియో కాల్స్‌లో సరికొత్త ఫీచర్లు ఇవే
వీడియో కాల్ మాట్లాడుతుండగా మన మూడ్‌కు తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ను(WhatsApp Video Calls) సెట్ చేయొచ్చు.
- By Pasha Published Date - 02:37 PM, Wed - 2 October 24

WhatsApp Video Calls : వీడియో కాల్స్ విభాగంలో వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వాటిని వినియోగించి యూజర్లు ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫీచర్ల ద్వారా యూజర్లకు ఎంతో కంఫర్ట్ కూడా లభించనుంది. ఇంతకీ ఏమిటా కొత్త ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Miss Universe India : సీతామాత పాత్రలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’.. అయోధ్య రాంలీలలో నటించే ఛాన్స్
వాట్సాప్ వీడియో కాల్‌లో కొత్త ఫీచర్స్..
- వాట్సాప్ కొత్త ఫీచర్స్ సాయంతో వీడియోకాల్ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకోవచ్చు.
- వీడియో కాల్ మాట్లాడుతుండగా మన మూడ్‌కు తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ను(WhatsApp Video Calls) సెట్ చేయొచ్చు. రద్దీగా ఉండే కేఫ్, బీచ్ ఇలా వివిధ రకాల బ్యాక్ గ్రౌండ్ ఫొటోలు అందుబాటులో ఉంటాయి.వాటిలో మనకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు.
- 10 రకాల బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
- వీడియో కాల్‌లో మాట్లాడే క్రమంలో మన ప్రైవసీని కాపాడుకునేలా కొన్ని ప్రత్యేక ఆప్షన్స్ లభిస్తాయి.
- వీడియో కాల్ చేసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్‌ను బ్లర్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, డ్రీమీ ఇలా వివిధ రకాల ఫిల్టర్‌లను వాట్సాప్ వీడియో కాలర్లు వాడుకోవచ్చు. దీనివల్ల వీడియో కాల్ సంభాషణల్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
- ప్రస్తుతం ఈ ఫీచర్లు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. ఇంకొన్ని వారాల్లో వీటిని తొలి విడతగా వాట్సాప్ బీటా యూజర్లకు విడుదల చేసే అవకాశం ఉంది.
- వాట్సాప్ వీడియో కాల్ ఫిల్టర్స్ ఫీచర్ వినియోగం వివరాలను స్వయంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సాప్ ఛానల్ ద్వారా వెల్లడించారు. వివిధ రకాల కొత్త ఫిల్టర్‌లను ఉపయోగించిన ఫొటోలను ఫాలోవర్లతో ఆయన షేర్ చేశారు.
- మొత్తం మీద వాట్సాప్ మెసేజింగ్ యాప్ కొత్తకొత్త ఫీచర్లకు వేదికగా మారింది. దీంతో దీనికి యూజర్లు మరింత అడిక్ట్ అవుతున్నారు. వాట్సాప్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజులో ఉందో మనందరికీ బాగా తెలుసు.