WhatsApp Multi Account: ఓకే ఫోన్ లో ఒకే వాట్సాప్ రెండు ఖాతాల్లో ఉపయోగించవచ్చు.. అదెలా అంటే?
ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో పాటు ప్రతి ఒక్కరూ డ్యూయల్ సిమ్ ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ విన
- By Anshu Published Date - 07:29 PM, Wed - 6 September 23

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో పాటు ప్రతి ఒక్కరూ డ్యూయల్ సిమ్ ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు వాట్సాప్ ని తప్పకుండా వినియోగిస్తూనే ఉంటారు. అందులో ఏదైనా ఒక నంబర్ తో మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. దీంతో రెండో నంబర్ పై కూడా వాట్సాప్ ఉపయోగించుకోవాలి అనుకునే వారికి ఇబ్బందులు తప్పవు. అందుకోసం చాలా మంది క్లోన్డ్ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీనిలో భద్రతా పరమైన సమస్యలు వస్తుంటాయి. లేదా ప్లే స్టోర్ నుంచి పేర్లల్ యాప్స్ ద్వారా మరికొందరు రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగిస్తుంటారు.
అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ యాజమాన్యం అటువంటి వారికి ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. ఒకే ఫోన్లో, ఒకే వాట్సాప్ లో రెండు అకౌంట్లను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ వివరాల్లోకి వెళితే.. వాబీటా ఇన్ ఫో ప్రకారం వాట్సాప్ సంస్థ తీసుకోవచ్చిన ఆ సరికొత్త ఫీచర్ పేరు వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఒకే ఫోన్ లోని యాప్ లో రెండు అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ కోసం వాట్సాప్ ప్రోఫైల్ సెట్టింగ్స్ ను రిడిజైన్ చేశారని వాబీటా ఇన్ ఫో రిపోర్టు చెబుతోంది. దీని సహాయంతో వినియోగదారులు తమ చాట్ లను ఒకే యాప్‌తో చాలాఖాతాల నుంచి నిర్వహించుకోవడానికి కూడా అనుమతిస్తుంది.
అదనంగా, ఇది సంభాషణలు, నోటిఫికేషన్‌లను వేరుగా ఉంచుతుంది. విభిన్న పరికరాలు లేదా పేర్లల్ యాప్‌ల అవసరం లేకుండా ఒకే పరికరంలో ఖాతాల మధ్య మారడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మీరు పొందడానికి వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మల్టీ అకౌంట్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవడమే. అయితే ఇది ప్రస్తుతం కేవలం కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ ఇది అందుబాటులోకి రానుంది.