50 Mega Pixel Front Camera : సెల్ఫీ కోసం 50 మెగా పిక్సెల్.. వివో నుంచి సరికొత్త మోడల్..!
50 Mega Pixel Front Camera భారత మార్కెట్ లోకి వివో రెండు సరికొత్త ఫోన్లను తీసుకొచ్చింది. మొబైల్ తయరీ సంస్థ వివో భారత్
- By Ramesh Published Date - 09:37 PM, Thu - 5 October 23

50 Mega Pixel Front Camera భారత మార్కెట్ లోకి వివో రెండు సరికొత్త ఫోన్లను తీసుకొచ్చింది. మొబైల్ తయరీ సంస్థ వివో భారత్ లో భారీ మార్కెట్ ని సంపాధించింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ నడుస్తుండగా వివో కొత్తగా వి29, వి 29 ప్రో పేరుతో రెండు మొబైల్స్ ను లాంచ్ చేసింది. అక్టోబర్ ఐదు అంటే ఈరోజు నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వివో ఆథరైజ్డ్ వెబ్ సైట్ తో పాటుగా ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, ఇంకా ఆఫ్ లైన్ మొబైల్ స్టోర్స్ లో కూడా ఇది అక్టోబర్ 10 నుంచి అందుబాటులో ఉంటుంది.
వివో వీ 29 (Vivo V29) 2 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ధర 32,999 రూ.లుగా నిర్ణయించారు. 8జీబీ+128జీబీ మొబైల్ ధర అది కాగా.. 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధర 36,999 రూ.లు గా నిర్ణయించారు. మెజెస్టిక్ రెడ్, హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ రంగుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read : Anupam Kher Praises Raviteja : ఇది సార్ రవితేజ అంటే.. ఇంతకన్నా ఏం కావాలి..?
వివో వీ29 ప్రో కూడా 2 వేరియంట్స్ తో వస్తుంది. 8జీబీ+256జీబీ ధర 39,999 రూ.లు కాగా.. 12 జీబీ+256జీబీ ధర 42,999 గా ఉంది.వీ 29 (V29) మొబైల్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఫన్ టచ్ ఓఎస్ తో వస్తుంది. 4600 ఎం.ఏ.హెచ్ బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వివో వీ 29 ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అయితే దీని ప్రధాన ఆకర్షణ ఫ్రెంట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. అంతేకాదు రేర్ కెమెరా కూడా 50 ఎంపీతో పాటుగా 8 ఎంపీ వైడ్ యాంగిల్ కి ఇచ్చారు. 2 ఎంపీ మోనో క్రోం సెన్సర్లు ఇవ్వడం జరిగింది. వివో వీ29 మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో కలిగి ఉంది.
We’re now on WhatsApp. Click to Join