Anupam Kher Praises Raviteja : అప్పుడు సెల్ఫీ ఇవ్వలేదు.. ఇప్పుడు చాటింపేసి చెబుతున్నాడు.. రవితేజ మాస్ అంటే ఇది..!
Anupam Kher Praises Raviteja మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అయన్ను చూసి స్పూర్తి పొందుతారు
- By Ramesh Published Date - 09:15 PM, Thu - 5 October 23

Anupam Kher Praises Raviteja మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అయన్ను చూసి స్పూర్తి పొందుతారు. ముఖ్యంగా పరిశ్రమలో మన వాళ్లు ఎవరు లేకపోయినా సరే నీలో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సరే నువ్వు అనుకున్నది సాధించగలవు అని ప్రూవ్ చేసిన వ్యక్తి రవితేజ. ఒకప్పుడు అతను సైడ్ రోల్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి చిన్నగా హీరోగా మారి ఆ తర్వాత మాస్ మహరాజ్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు.
ప్రస్తుతం రవితేజ (Raviteja) టైగర్ నాగేశ్వర రావు సినిమా చేశాడు. దసరాకి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను హిందీలో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావులో కీలక పాత్ర చేసిన అనుపం ఖేర్ రవితేజని హిందీ ఆడియన్స్ కు పరిచయం చేశారు. ఇతను రవితేజ ఈయన నటించిన కిక్, విక్రమార్కుడు సినిమాలే హిందీలో రీమేక్ అయ్యాయని చెప్పారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి న్యూ లుక్ కేక
అంతేకాదు ఈయన ఒకప్పుడు తనతో ఫోటో కావాలని అడిగాడు కానీ అప్పుడు నేను ఇవ్వలేదు కానీ ఇప్పుడు అతను హీరోగా నటించిన సినిమాలో తను నటించానని చెప్పారు అనుపం ఖేర్. రవితేజ ఎదుగుదలకు ఇదే నిదర్శనమని అన్నారు అనుపం ఖేర్.
టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమా విషయానికి వస్తే సినిమా స్టూవర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా స్పూర్తితో తెరకెక్కించారు. సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉండగా సినిమాలో ఎమోషన్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join