Vivo V27e: మార్కెట్ లోకి వివో వి27ఈ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం
- By Nakshatra Published Date - 07:00 AM, Sun - 5 March 23

ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది వివో సంస్థ. వివో ఇటీవలే వి27 సిరీస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సిరీస్‌లో కొత్త మోడల్‌ను మాలేషియా లో లాంచ్ చేసింది. వివో వి27ఈ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
మరి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ధర విషయానికి వస్తే.. కాగా వివో వి27ఈ మోడల్ 8జీబీ 256జీబీ సింగిల్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. మలేషియన్ కరెన్సీలో RM 1,299 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.23,400. కాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. వివో వి27ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, కెపాసిటివ్ మల్టీ టచ్ సపోర్ట్‌తో 6.62 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2,400 × 1,080 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఈ చిప్‌సెట్ 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత Funtouch OS 13పై రన్ అవుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. వివో వి27ఈ లో ఆప్టిక్స్ కోసం రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. OISతో కూడిన 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో యూనిట్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. సింగిల్ కలర్ టెపరేచర్‌తో ట్రిపుల్ రియర్ ఫ్లాష్ కూడా ఇందులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 66W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4,600 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఈ ఫోన్ గ్లోరీ బ్లాక్, ల్యావేండర్ పర్పుల్ వంటి రెండు కలర్ లలో లభించనుంది.

Related News

OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం