Vivo T3 Ultra Vs Vivo T3 Pro: ఈ రెండు 5జీ స్మార్ట్ ఫోన్ల మధ్య తేడా ఏంటి.. వాటి ధర ప్రత్యేకతల గురించి తెలుసా?
వివో టీ 3 అల్ట్రా అలాగే వివో టీ 3 ప్రో మధ్య తేడాల గురించి వివరించారు.
- By Anshu Published Date - 12:47 PM, Wed - 18 September 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గం వివో సంస్థ ఇటీవలే భారత మార్కెట్లోకి వివో టీ3 అల్ట్రా అలాగే వివో టీ3 ప్రో స్మార్ట్ ఫోన్ అని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ధర విషయంలో ఫీచర్స్ విషయంలో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండు పోల్చుకున్నప్పుడు ఏది మంచిది అన్న సందేహం చాలా మందిని కలుగుతోంది. ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలి అని చాలామంది సందేహ పడుతున్నారు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. వివో ఇటీవల టీ3 అల్ట్రా 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అనేక ఆఫర్లతో కంపెనీ దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
వివో టీ3 ప్రో ఫోన్ ఈ ఏడాది ఆగస్టులో విడుదల అయ్యింది. కాగా వివో టీ3 అల్ట్రా ఫోన్ ధర రూ.28,999 కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ పేమెంట్‌తో మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. వివో టీ3 ప్రో 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 24,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ ను లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. మీరు వివో టీ3 ప్రో ఫోన్‌ను ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. వివో టీ3 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో టీ3 ప్రో 5G మొబైల్ 6.67 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 4500 ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. వివో టీ3 అల్ట్రా ఫోన్ మీడియాటేక్ డైమేన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14తో రన్ అవుతుంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. వివో టీ3 అల్ట్రా 5G మొబైల్ 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది వర్చువల్ ర్యామ్ కోసం మద్దతును కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్ ను 24జీబీ వరకు పెంచుకోవచ్చు. వివో T3 ప్రో ఫోన్ 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. వివో టీ3 అల్ట్రా ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఓఐఎస్ మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా బ్యాక్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఇక వివో టీ3 ప్రో మొబైల్ డ్యూయల్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.అలాగే వివో టీ3 అల్ట్రా ఫోన్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. వివో టీ3 ప్రో మొబైల్ 5,500mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కంపెనీ తన కొత్త ఫోన్ బ్యాటరీలో ఎలాంటి మార్పులు చేయలేదు. వివో టీ3 అల్ట్రా 5G ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ పొందింది. వివో టీ3 ప్రో మొబైల్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 2000 Hz క్విక్ టచ్ ప్యాటర్న్ రెడ్, 4డీ గేమ్ వైబ్రేషన్ వంటి సపోర్ట్‌తో వస్తుంది.