Twitter Message Limit : ట్విట్టర్ లో డైరెక్ట్ మెసేజ్ లకు లిమిట్.. సాధారణ యూజర్స్ కు బ్యాడ్ న్యూస్
Twitter Message Limit : ట్విట్టర్ త్వరలో మరో కీలక మార్పును తీసుకురాబోతోంది. వేరిఫైడ్ కాని (అన్ వేరిఫైడ్) ట్విట్టర్ అకౌంట్స్ ... అదేనండి సాధారణ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి పంపే డైరెక్ట్ మెసేజ్ ల లిమిట్ ను తగ్గించనుంది.
- By Pasha Published Date - 11:37 AM, Sat - 22 July 23

Twitter Message Limit : ట్విట్టర్ త్వరలో మరో కీలక మార్పును తీసుకురాబోతోంది.
వేరిఫైడ్ కాని (అన్ వేరిఫైడ్) ట్విట్టర్ అకౌంట్స్ … అదేనండి సాధారణ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి పంపే డైరెక్ట్ మెసేజ్ ల లిమిట్ ను తగ్గించనుంది.
ట్విట్టర్ లో స్పామ్ మెసేజ్ లను కట్టడి చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం(Twitter Message Limit) దిశగా ట్విట్టర్ అడుగులు వేస్తోంది.
ఒకవేళ డైరక్ట్ మెసేజ్ లు లిమిట్ లేకుండా పంపాలని భావిస్తే “ట్విటర్ బ్లూ” కోసం సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి నిర్ణయాల ద్వారా ట్విట్టర్ ప్లాట్ ఫామ్ అనేది ప్రీమియం కస్టమర్లకు మాత్రమే వేదికగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది.
Also read : KCR: తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి
Twitter బ్లూకు సబ్ స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు ప్రీమియం లుక్ ను ఇచ్చే ‘బ్లూ టిక్’ని పొందొచ్చు. దీనివల్ల ట్వీట్‌లను ఎడిట్ చేసే ఆప్షన్ వస్తుంది. 25,000 అక్షరాల దాకా పెద్ద పెద్ద ట్వీట్‌లను పోస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. 2 గంటల వ్యవధిలో 1080p వీడియోలను కూడా పోస్ట్ చేయొచ్చు. ట్విటర్ బ్లూకు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారి ట్వీట్లకు మెరుగైన రీచ్ లభిస్తుంది. దాదాపు 50 శాతం తక్కువ రేట్లకే ట్విట్టర్ లో యాడ్స్ పబ్లిష్ చేసే అవకాశం దక్కుతుంది. ట్విట్టర్ యాడ్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎంపిక చేసిన యూజర్స్ కు పంచిపెట్టే స్కీంను కూడా ఇటీవల ట్విట్టర్ ప్రారంభించింది. ఈ అవకాశం కూడా Twitter బ్లూ చందాదారులకు మాత్రమే పరిమితం. వరుసగా 3 నెలల వ్యవధిలో ట్విట్టర్ పోస్ట్‌లపై కనీసం 50 లక్షల పబ్లిక్ ఇంప్రెషన్‌లను కలిగి ఉన్న కంటెంట్ క్రియేటర్లకు యాడ్ రెవెన్యూలో వాటా దక్కుతుంది.
Also read : Nabha Natesh :స్టైలిష్ లుక్ లో నభా నటేష్ సూపర్ స్టిల్స్