Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్ ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు?
జీవిత బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి వినూత్నంగా ఆలోచిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త
- By Nakshatra Published Date - 06:00 PM, Thu - 29 June 23
జీవిత బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి వినూత్నంగా ఆలోచిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త నియమాలను సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసం వారికి అనుగుణంగా ఉండే సౌకర్యాలను అందజేస్తున్నాయి బీమా కంపెనీలు. దీని కింద టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తమ వినియోగదారులకు కొత్త సేవను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడానికి ఇప్పుడు వినియోగదారులు వాట్సాప్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లేదా యూపీఐ ని ఉపయోగించవచ్చు అని తెలిపింది. ఈ సదుపాయాన్ని తొలిసారిగా వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ లో సుమారు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులు ఉండగా అందులో దాదాపు 3 మిలియన్లకు పైగా యూపీఐ వినియోగదారిలో ఉన్నారు. టాటా ఏఐఏ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందించడం కోసం వాట్సాప్, పేయు సహాయం తీసుకుంటోంది. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ హెడ్ సంజయ్ అరోరా తెలిపారు.
ఈ సమయంలో కంపెనీ డిజిటల్ మోడ్ ద్వారా ఇన్నోవేషన్ప్రీమియం వసూలు చేయడం ప్రారంభించింది. ఈ ఫ్లాట్ ఫారం లో మరొక ఐదు భాషలు చేర్చబడ్డాయి. అందులో ఇంగ్లీష్,హిందీ, తమిళం,గుజరాతి, బెంగాలీ భాషలు కూడా ఉన్నాయి. కాగా 2022 ఆర్థిక సంవత్సరానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నికల ఆదాయం రూ.71 కోట్లు. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.506 కోట్లకు పెరిగింది. టాటా గ్రూప్ కంపెనీ తన కొత్త బిజినెస్ ప్రీమియాన్ని దాదాపు రూ. 7,093 కోట్ల మేర పెంచింది. అంటే గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 59 శాతం పెరిగింది.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.