News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Technology News
  • ⁄Suzuki Demonstrates V2x Technology For Cars At Iit H

V2X Tech: వీ2ఎక్స్ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కారే కంప్యూటర్ గా..!

రోడ్డు మీద బండి నడపాలంటే భయం. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని.

  • By Hashtag U Published Date - 12:27 PM, Thu - 12 May 22
V2X Tech: వీ2ఎక్స్ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కారే కంప్యూటర్ గా..!

రోడ్డు మీద బండి నడపాలంటే భయం. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణం పోతుంది. అలా మన దేశంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలు దాదాపు 4,50,000. ఈ ప్రమాదాల వల్ల చనిపోతున్నవారు దాదాపు 1,50,000. ఇది ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్పిన నిజం. ప్రపంచంలో ఉన్న వాహనాల్లో మన దగ్గరున్నవి కేవలం ఒక శాతం. కానీ ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 11 శాతం మంది మన దేశంవారే. అందుకే రోడ్డు ప్రమాదాలకు పూర్తిగా చెక్ పెట్టేలా వీ2ఎక్స్ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది.

వాహనాలు వేగంగా వెళ్తున్నప్పుడు కాని, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నప్పుడు కాని రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటివాటిని వెహికల్ టూ ఎవ్రీథింగ్ -వీ2ఎక్స్ టెక్నాలజీ పూర్తిగా అడ్డుకుంటుంది. హైదరాబాద్ ఐఐటీ, సుజుకి మోటార్ కార్పొరేషన్, మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థలు తొలిసారిగా ఈ టెక్నాలజీని
తయారుచేశాయి. హైదరాబాద్‌ ఐఐటీ లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా చూపించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సాంకేతికతపై ఆసక్తిని చూపించింది. అందుకే రాష్ట్రంలో రోడ్లపై ఈ టెక్నాలజీని పరీక్షించి.. ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయో చెప్పాలని కోరింది.

ఈ వీ2ఎక్స్ టెక్నాలజీ.. రోడ్డుపై ప్రయాణించే అన్ని రకాల వెహికల్స్ తోపాటు పాదచారులతోనూ లింక్ అయి ఉంటుంది. అందుకే చుటుపక్కల ఉన్న వాహనాలు, అవి ఎంత వేగంతో వస్తున్నాయి.. ఏవి దగ్గరగా వస్తున్నాయి అన్నది గమనిస్తుంది. ఆమేరకు డ్రైవర్ ను ముందే అప్రమత్తం చేస్తుంది. అంబులెన్స్ ఎన్ని నిమిషాల్లో తన వాహనాన్ని సమీపిస్తుందో, ఎటువైపు దారి ఇవ్వాలో కూడా ఇది ముందే వాహనదారుడిని హెచ్చరిస్తుంది. రోడ్డుదాటేవారిని ముందే గుర్తిస్తుంది. సందులు, మలుపుల్లో అకస్మాత్తుగా వచ్చే బైకులు వంటి 2 వీలర్స్ ఎంత దూరంలో ఉన్నాయో.. ఏ డైరెక్షన్ లో వస్తున్నాయో కూడా చెబుతుంది.

రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలు చాలా దూరంలో ఉన్నప్పుడే ఈ వీ2ఎక్స్ టెక్నాలజీ గుర్తిస్తుంది. రోడ్లు బాగాలేని చోట ముందే అలెర్ట్ చేస్తుంది. కారును డ్రైవ్ చేయనప్పుడు.. అందులో ఉండే మైక్రో ప్రాసెసర్ ను కంప్యూటర్ గా ఈ టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకోవచ్చు.

Tags  

  • check road accidents
  • IIT Hyderabad
  • suzuki
  • V2X Technology
  • Vehicle-to-Everything

Related News

Tamilisai : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ‘గవర్నర్ తమిళిసై’ పిలుపు..!

Tamilisai : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ‘గవర్నర్ తమిళిసై’ పిలుపు..!

విద్యా సంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని.. మానవాళికి తమవంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన జీవన్ లైట్-స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్‌ను గవర్నర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ… క

  • IIT Hyderabad: దివ్యాంగుల కోసం ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ…వివరాలు ఇవే..!

    IIT Hyderabad: దివ్యాంగుల కోసం ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ…వివరాలు ఇవే..!

  • IIT Hyderabad:విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు

    IIT Hyderabad:విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Latest News

  • Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

  • Davos Challenge : సోద‌రుల‌కు `దావోస్` ఛాలెంజ్‌!

  • The Kashmir Files: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: