WhatsApp Stickers: వాలెంటైన్స్ డే కోసం వాట్సాప్ లో ప్రత్యేక స్టిక్కర్లు..!
ప్రేమికుల దినోత్సవం (Valentine Day) (ఫిబ్రవరి 14) రోజున వాట్సాప్ లో మెస్సేజ్ ల మోత మోగుతుంటుంది.
- By Maheswara Rao Nadella Published Date - 01:37 PM, Tue - 14 February 23

ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజున వాట్సాప్ (WhatsApp) లో మెస్సేజ్ ల మోత మోగుతుంటుంది. ప్రత్యేక సందేశాలతో తమకు కావాల్సిన వారి మనసుకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు ప్రేమికులు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమపూర్వక సందేశాలు పంపుకునేందుకు వాట్సాప్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు తమ వాట్సాప్ లో ఈ స్టిక్కర్లు (WhatsApp Stickers), ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చు. యూజర్లు వాట్సాప్ యాప్ (WhatsApp) ఓపెన్ చేయాలి. సందేశం పంపాలనుకునే కాంటాక్ట్ ను సెలక్ట్ చేసుకోవాలి. కింద మెస్సేజ్ బార్ లో కనిపించే స్మైలీ ఐకాన్ ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ జిఫ్ బటన్ పక్కక కనిపించే స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేయాలి. దాంతో లవ్ సింబల్ తో కూడిన స్టిక్కర్లు కనిపిస్తాయి. అక్కడే మరికొన్ని ఆప్షన్లు కూడా ఉన్నాయి. యూజర్లు తమకు నచ్చినది ఎంపిక చేసుకుని కావాల్సిన వారికి సెండ్ చేసుకోవచ్చు. ‘గెట్ మోర్ స్టిక్కర్స్’ను సెలక్ట్ చేసుకుంటే గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ కు తీసుకెళుతుంది. అక్కడి నుంచి థర్డ్ పార్టీ వాట్సాప్ స్టిక్కర్ (WhatsApp Stickers) యాప్స్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా మరిన్ని స్టిక్కర్స్ ను పొందొచ్చు.
Also Read: Mobile App: డయాబెటిస్ బాధితుల కోసం మొబైల్ యాప్..!