Reverse Image Search : ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ ఫీచర్.. మార్ఫింగ్ ఫొటోలకు వాట్సాప్ చెక్
రాబోయే కొన్ని వారాల్లో విడతల వారీగా మరింత మంది వాట్సాప్ యూజర్లకు(Reverse Image Search) దీన్ని అందుబాటులోకి తెస్తారు.
- By Pasha Published Date - 02:15 PM, Wed - 6 November 24

Reverse Image Search : వాట్సాప్ కొత్తకొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది. వాట్సాప్‌లో షేర్ అయ్యే కంటెంట్ నిజమైందా ? కాదా ? అనేది యూజర్స్ తెలుసుకునేందుకు దోహదపడే టూల్స్‌ను తెచ్చే దిశగా కీలక ముందడుగు వేసింది. వాట్సాప్‌లో ఎవరైనా ఏదైనా ఫొటోను పంపితే.. అది నిజమైందో.. ఫేక్‌దో తెలుసుకునేందుకు దోహదపడే టూల్‌ను డెవలప్ చేసింది. దాని పేరే.. ‘సెర్చ్ ఆన్ వెబ్’. మనం వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను ఓపెన్ చేసి చూసేటప్పుడు ఈ ఆప్షన్ కూడా వస్తుంది. దీని ద్వారా మనం ఆ ఫొటోకు సంబంధించిన ఇంటర్నెట్ మూలాలను తెలుసుకోవచ్చు. తద్వారా అది నిజమైందా ? గ్రాఫిక్ ఎఫెక్ట్స్‌తో మార్ఫింగ్ చేసినదా ? అనేది తెలిసిపోతుంది. మరో యాప్ లేదా వెబ్ బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వాట్సాప్‌లోనే ఇమేజ్ వివరాలను వెబ్ సెర్చ్ చేసేందుకు ఈ ఆప్షన్ అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేసే కంటెంట్, ఫొటోలకు మరింత పారదర్శకత పెరుగుతుందని వాట్సాప్ ఆశిస్తోంది.తొలుత ఈ ఫీచర్‌ను వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. రాబోయే కొన్ని వారాల్లో విడతల వారీగా మరింత మంది వాట్సాప్ యూజర్లకు(Reverse Image Search) దీన్ని అందుబాటులోకి తెస్తారు.
Also Read :Light Motor Vehicle : లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉందా?.. ‘సుప్రీం’ గుడ్ న్యూస్
- వాట్సాప్ ఛాట్‌లో మనం ఏదైనా ఫొటోను ఓపెన్ చేయగానే.. ఎగువ భాగంలో కుడివైపున త్రీ డాట్స్ మెనూ కనిపిస్తుంది.
- ఆ మెనూను క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘‘Search on web’’ అనే ఆప్షన్ కూడా ఉంటుంది.
- ఆ ఆప్షన్‌ను క్లిక్ చేశాక డిస్‌ప్లే అయ్యే ‘Search’ మెనూపై క్లిక్ చేయగానే రివర్స్ ఇమేజ్ సెర్చ్ మొదలవుతుంది.
- ఇమేజ్ సెర్చ్ పూర్తికాగానే.. ఆ ఫొటో వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఈ ఫొటోను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు వినియోగించారు అనేది కూడా తెలిసిపోతుంది.
- ఆ ఫొటోను మార్ఫింగ్ చేశారా ? అనేది కూడా తెలుస్తుంది.