Smartphones: మార్కెట్ లోకి దూసుకుపోతున్న కొత్త ఫోన్స్.. ఫీచర్స్ మాములుగా లేవుగా!
ఈ ఏడాది ఆఖరి లోపు మరిన్ని కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి.
- By Anshu Published Date - 12:03 PM, Thu - 17 October 24

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక దాని నుంచి ఒకటి ఫీచర్లు, ధరలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్వరలోనే మార్కెట్లోకి కొన్ని కొత్త ఫోన్స్ తీసుకురానున్నాయి. మరి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఆ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఐక్యూ నియో 10 ప్రో… ఐక్యూ నియో 10 ప్రో ఫోన్ కూడా త్వరలోనే లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ను అందించనున్నారు. ఐక్యూ నియో 9 ప్రో 5జీకి కొనసాగింపుగా ఈ ఫోన్ ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో అత్యాధునిక, అద్భుతమైన ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.
వన్ ప్లస్ ఎస్ 5.. వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో తో పాటు త్వరలో వన్‌ప్లస్ ఏస్ 5ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 100 వాట్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 6500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన కెమెరాను అందించనున్నారట. అలాగే ఇందులో ఎక్స్2 ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రియల్ మీ జీటీ నియో 7.. ఈ ఏడాది చివరిలో లాంచింగ్ కు సిద్దమవుతోన్న మరో ఫోన్ రియల్‌మీ జీటీ నియో7. ఈ స్మార్ట్ ఫోన్‌ను మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ను ఇవ్వనున్నారు. 100 వాట్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని కూడా ఇవ్వనున్నారు.
రెడ్ మీ కె 80.. అలాగే ఈ ఏడాది చివరల్లో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న బెస్ట్ ఫోన్స్ లో ఈ రెడ్‌మీ కే80 కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌ను డిసెంబర్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఇక ఇందులో 2కే రిజల్యూషన్ తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా ఫోన్ సపోర్ట్ చేయనుందట..