Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొంటారా ? టాప్ 5 ఆప్షన్స్ ఇవే
Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొనేందుకు రెడీ అవుతున్నారా ?
- By Pasha Published Date - 02:15 PM, Sat - 27 January 24
Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొనేందుకు రెడీ అవుతున్నారా ? స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ లాంటి డివైజ్‌లు అన్నింటినీ ఛార్జ్ చేసుకునేంత హై కెపాసిటీ పవర్ బ్యాంక్ కోసం వెతుకుతున్నారా ? మీ అన్ని అవసరాలను తీర్చగలిగే మెరుగైన కెపాసిటీతో, బెటర్ క్వాలిటీతో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 పవర్ బ్యాంక్‌లపై(Top 5 Power Banks) ఓ లుక్కేద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
1. MI 3i Power Bank
ఎంఐ బ్రాండ్ నుంచి ‘ఎంఐ 3ఐ’ మోడల్ పవర్ బ్యాంక్ రిలీజైంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. దీనిలో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీ కెపాసిటీ 10,000 mAh. మైక్రో యూఎస్బీ, టైప్ -సీ ఇన్పుట్ పోర్టులు కూడా పవర్ బ్యాంకులో ఉంటాయి. రెండు అవుట్‌పుట్ పోర్టులు కూడా ఉంటాయి.
2. MI Power Bank Pocket Pro
ఎంఐ బ్రాండ్ నుంచి ‘ఎంఐ పవర్ బ్యాంక్ పాకెట్ ప్రో’ మోడల్ పవర్ బ్యాంక్ రిలీజైంది. దీని కెపాసిటీ 10,000 mAh. ఇది 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో మైక్రో యూఎస్బీ, టైప్-సీ ఇన్పుట్ పోర్టులతో పాటు 3 అవుట్‌పుట్ పోర్టులు ఉంటాయి. ఇది పాకెట్ సైజులో, లైట్ వెయిట్‌తో ఉంటుంది. దీన్ని మనం ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
3. Redmi Power Bank
రెడ్మీ బ్రాండ్ నుంచి ‘రెడ్మీ పవర్ బ్యాంక్’ విడుదలైంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీని కెపాసిటీ 10,000 mAh. ఇందులో మైక్రో యూఎస్బీ, టైప్ సీ రకానికి చెందిన డబుల్ యూఎస్బీ పోర్టులు ఉన్నాయి.
4. Portronics Luxcell Power Bank
పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి ‘పోర్ట్రానిక్స్ లక్స్ సెల్ పవర్ బ్యాంక్’ విడుదలైంది. దీని కెపాసిటీ 10,000 mAh. ఇది 22.5 వాట్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీనిలో యూఎస్బీ-ఏ, 2 x యూఎస్బీ-సీ డ్యూయెల్ పోర్టులు ఉన్నాయి. దీనికి BIS సర్టిఫికేషన్ చిప్ ప్రొటెక్షన్ గ్యారెంటీ కూడా ఉంది. ఇందులో ఎల్ఈడీ బ్యాటరీ ఇండికేటర్, కాంపాక్ట్ డిజైన్, టైప్-సీతో సహా టైప్-సీ కేబుల్ కూడా ఉంటాయి.
5. Amazon Basics Power Bank
అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ నుంచి ‘అమెజాన్ బేసిక్స్ పవర్ బ్యాంక్’ విడుదలైంది. ఇందులో లిథియం-పాలీమర్ బ్యాటరీ ఉంది. ఇది 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ కెపాసిటీ 10,000 mAh. దీనిలో టైప్-సీ అవుట్‌పుట్, 2 యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా మూడు అవుట్‌పుట్ పోర్టులు ఉన్నాయి.
Also Read : AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్
Related News
IPL Playoff Scenarios: ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేస్…
ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుతుండడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.