Self Cleaning Cloth: సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్ వచ్చేసింది.. అత్యంత చలిలోనూ ఇక బేఫికర్
కాటన్ వస్త్రంలోకి అత్యంత సన్నగా ఉండే సిల్వర్ నానో వైర్లను ప్రవేశపెట్టి ఈ సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్‌ను(Self Cleaning Cloth) తయారు చేశారు.
- By Pasha Published Date - 09:07 PM, Thu - 13 February 25

Self Cleaning Cloth: టెక్నాలజీలో, రీసెర్చ్‌లో భారతీయ సైంటిస్టులు దూసుకుపోతున్నారు. తాజాగా ఓ అద్భుత వస్త్రాన్ని అసోంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువహటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. అది స్వయంగా తనను తాను క్లీన్ చేసుకోగలదు. చలి వాతావరణంలోనూ తగినంత వేడిని అందించగలదు. మొత్తం మీద అతి శీతల వాతావరణంలో ఉండేవారిని అతి తక్కువ నిర్వహణ వ్యయంతో ఆరోగ్య సమస్యల నుంచి రక్షించగలదు. ఈమేరకు వివరాలతో ‘నానో మైక్రో సెల్’ జర్నల్‌లో ఒక అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది.
Also Read :Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు
సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్ విశేషాలివీ..
- కాటన్ వస్త్రంలోకి అత్యంత సన్నగా ఉండే సిల్వర్ నానో వైర్లను ప్రవేశపెట్టి ఈ సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్‌ను(Self Cleaning Cloth) తయారు చేశారు.
- ఈ వస్త్రంలో ఉండే నానో వైర్లు, మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు సన్నగా ఉంటాయి.
- నానో వైర్లు చాలా సన్నగా ఉండటం వల్ల, వాటి నుంచి విద్యుత్ ప్రసారం జరిగే వీలుంటుంది. అయితే దీనిలో నుంచి ప్రవహించే విద్యుత్ ఓల్టేజీ స్థాయి చాలా స్వల్పంగా ఉంటుంది. ఫలితంగా కరెంట్ షాక్ తగులుతుందనే ఆందోళన అక్కర్లేదు.
- చిన్నపాటి బ్యాటరీ లేదా సోలార్ ఎనర్జీ ద్వారా ఈవస్త్రాన్ని వెచ్చగా ఉంచొచ్చు. దీనిలో సగటున 10 గంటల పాటు 40 నుంచి 60 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు.
Also Read :Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ
- ఈ వస్త్రంలోని సిల్వర్ నానో వైర్ల మన్నికను పెంచడానికి, వాటికి వాటర్ రెపెల్లెంట్ కోటింగ్ వేయించారు. ఫలితంగా అవి ఆక్సిడేషన్, నీరు, మరకల నుంచి రక్షణ పొందుతాయి. ఈ కారణం వల్లే ఇది సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్‌గా మారిపోయింది.
- అతిశీతల వాతావరణంలోనూ ఈ వస్త్రం పొడిగానే ఉండగలదు.
- చెమట, వర్షపు జల్లులు, రక్తపు మరకలు వంటివి పడినా ఈ వస్త్రానికి డ్యామేజీ జరగదు.
- ఈ వస్త్రం వెచ్చదనం అందిస్తుంది. మృదువుగా ఉంటుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా మారిపోగలదు.
- ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన మోకాళ్ల బ్యాండ్‌లు, మోచేతుల బ్యాండ్‌లలో ఈ వస్త్రాన్ని టెస్ట్ చేశారు. ఈ వస్త్రంతో ఫ్యూచర్‌లో ఆయా బ్యాండ్‌లను తయారు చేస్తే, వారికి మరింత మెరుగైన హీట్ థెరపీని అందించగలదు.
- ఈ వస్త్రం ఆవిష్కరణపై పేటెంట్ కోసం ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.