Samsung Galaxy F04: అతి తక్కువ ధరకే శాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన
- By Nakshatra Published Date - 07:00 AM, Thu - 5 January 23
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది శాంసంగ్ సంస్థ. ఈ నేపథ్యంలోని తాజాగా మరొక స్మార్ట్ ఫోన్ ని కూడా బడ్జెట్ ధరలో వినియోగదారులకు అందించడానికి సిద్ధమయ్యింది. తాజాగా శాంసంగ్ సంస్థ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ నీ భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ధర వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,499 నుంచి ప్రారంభమవుతుంది. 4జీబీ ర్యామ్,64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ను కలిగి ఉంటుంది. అయితే ఇది కేవలం లాంచింగ్ ఆఫర్ ప్రైజ్ మాత్రమే. ఆఫర్ ముగిసిన తరువాత శాంసంగ్ ఫోన్ ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉండనుంది. అయితే జనవరి 12 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. కాగా ఈ ఫోన్ మనకు రెండు కలర్స్‌లో లభించనుంది. అందులో ఒకటి ఓపల్ గ్రీన్, జెడ్ పర్పుల్ కలర్. ఇకపోతే శాంసంగ్ గెలాక్సి F04 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.5 అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లే ఉంది.
1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా వన్ UI 4.1పై ఫోన్ పనిచేస్తుంది. కాగా, ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ వెర్షన్లను పొందుతుంది. ఇక ఇందులోని సాఫ్ట్వేర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ నుంచి 8జీబీ ర్యామ్ వరకు డిఫరెంట్ వేరియంట్స్లలో లభిస్తున్నాయి. అలాగే ఇందులో స్టోరేజ్ 64 జీబీతో పాటుగా ఎస్డి కార్డు సహాయంతో స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. కెమెరా విషయానికి వస్తే.. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ను కలిగి ఉండనుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.