Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ప్రీ బుకింగ్స్ ఓపెన్.. వారికీ మాత్రమే బంపర్ ఆఫర్?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం
- By Anshu Published Date - 10:00 PM, Thu - 11 January 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా శాంసంగ్ సంస్థ ప్రతి ఏడాది ఎస్ సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇప్పటికే శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్ 24కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ నెల 17న ఎస్ 24ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫీచర్ల పరంగా ఈ ఫోన్ అందరి మనన్నలు పొందుతుందని భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్‌ను లాంచ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా ప్రీ బుకింగ్ చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కాబట్టి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం ముందస్తు రిజర్వేషన్‌ను కూడా ప్రారంభించింది. వినియోగదారులు దాని అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఫోన్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రీ-రిజర్వ్ చేయడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాలి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు రూ. 5,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు, కొనుగోలుదారులు సామ్‌సంగ్ షాప్ యాప్ కోసం ఉత్తమ అప్‌గ్రేడ్ విలువ మరియు రూ.5,000 విలువైన వెల్‌కమ్ వోచర్‌ను కూడా పొందుతారు.
అయితే గెలాక్సీ ఎస్ 24 కోసం ప్రీ రిజర్వ్ చేయడానికి కస్టమర్‌లు కొన్ని ప్రాథమిక వివరాలను అందించాలి. ముందుగా సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. తదుపరి గెలాక్సీ ప్రీ-రిజర్వ్ వీఐపీ పాస్‌ను జోడించడానికి ప్రీ-రిజర్వ్ బటన్‌పై క్లిక్ చేయాలి. అందుబాటులో ఉన్న ఏదైనా ప్రీపెయిడ్ చెల్లింపు ఎంపికలను ఉపయోగించి రూ. 1999/- చెల్లించారు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ & మెసేజ్ ద్వారా తదుపరి గెలాక్సీ ప్రీ-రిజర్వ్ వీఐపీ పాస్‌ని అందుకుంటారు. ముందస్తు రిజర్వ్ కొనుగోలు కోసం రెఫరల్, స్వాగత వోచర్, లాయల్టీ పాయింట్‌లను ఉపయోగించలేరు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.2-అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ ఫుల్ హెచ్‌డీ స్‌ప్లేతో పాటు 8కే వీడియో రికార్డింగ్‌కు మద్దతు 50 ఎంపీ ప్రధాన కెమెరా, గరిష్టంగా 30 ఎక్స్ స్పేస్ జూమ్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఈ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ని చేరుకోగలదు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24+ మోడల్‌లో 6.7-అంగుళాల ఎమోఎల్‌ఈడీ, 2 ఎక్స్ క్యూహెచ్‌డీ + డిస్‌ప్లే, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 నిమిషాల్లో 65 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 12 జీబీ + 256 జీబీ, 512 జీబీ నిల్వ ఎంపికలను కలిగి ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మోడల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను గుర్తుకు తెచ్చే టైటానియం బాడీతో వచ్చే అవకాశం ఉంది. ఈ వేరియంట్ ఎస్ 24+తో ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లను వస్తుంది. ఇది 200 ఎంపీ మెయిన్ లెన్స్, 10 ఎక్స్ క్వాడ్ టెలిఫోటో, 100 ఎక్స్ స్పేస్ జూమ్‌తో సహా అధునాతన కెమెరా సిస్టమ్‌ను పరిచయం చేయవచ్చు. ఎస్ 24 అల్ట్రా 6.8 అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.